అమరావతికి రాజధాని అన్నప్పటి నుంచి తెలుగుదేశం సేవలో తరిస్తున్న ఒక సీనియర్ రిపోర్టర్ గురించి మీడియా వర్గాలే గాక రాజకీయ వర్గాలు కూడా నవ్వుకుంటున్నాయి. ఆంఢ్రజ్యోతిలో గుంటూరు విలేకరిగా వుంటూ తర్వాత టీవీ ఛానల్లో చర్చలు నిర్వహించిన ఆ రిపోర్టర్ కమ్ జర్నలిస్టు కృష్ణా గుంటూరు జిల్లాల్లో సుపరిచితుడే. ఆ టీవీ అంతగా అభివృద్ధి చెందని వాస్తవం గుర్తించి తిరిగి పూర్వాశ్రమానికి వెళ్లిపోయారు. అప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విజయవాడకు మకాం మార్చేశారు. అంతే. అప్పటి నుంచి పాలకఫక్షానికి సంబందించిన సామాజిక వర్గంతో గాఢమైన సంబంధాలున్న సదరు జర్నలిస్టు మరీ రెచ్చిపోయారు. ప్రతివార్తపైన ఆయన తెలుగుదేశం అధికార వెర్షన్ ఇవ్వగలరు.
ఏదైనా తప్పుగా వస్తే తను పనిచేసే ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా కవరప్ చేసే కథలు మొదలు పెడతారు. దాదాపు తెలుగుదేశం అదికార ప్రతినిధుల కన్నా మిన్నగా అధినేత హృదయం ఆంతరంగికుల భావనలు ఎరిగిన ఈ రిపోర్టర్ రకరకాల మెలికలతో వ్యాఖ్యలతో తెలుగుదేశం నాయకత్వం తప్పేమీ లేదని ప్రభుత్వం ఇప్పటికే తన బాధ్యత నిర్వహించిందని చెప్పడానికి తంటాలు పడతారు. దానికి తగినట్టే తెలుగుదేశం కీలక నేతలు, ఎమ్మెల్యే లు , మంత్రులు అతనికి నిరంతరం అందుబాటులో వుంటారు. పిలిస్తే వచ్చేసి అధికార గీతం పాడేస్తారు. ఒకోసారి ఆయన వారిని చేయిపట్టుకుని లాగడం, పరోక్షంగా ప్రాంప్టింగ్ట్ చేయడం కూడా గమనించవచ్చు.ఈయన వ్యవహార సరళి, అనుబంధాలు అభిమానాలు తెలిసిన వారు అప్పడప్పుడూ అపహాస్యం చేస్తున్నా పెద్దగా పట్టించుకోడు. పాలకపక్షం కవరేజి, అవసరమైతే కవరప్ తన పనిగా పెట్టుకున్నారు గనక ఆ సేవలోనే తరిస్తుంటారు. అందులోనూ మరీ ముఖ్యంగా తండ్రీకొడుకులను అంటే చంద్రబాబునూ లోకేష్ ను ఎల్లవేళలా సరైన కోణంలో చూపడానికి, ఏదైనా మరక అంటితే కవరప్ చేయడానికి ఎవరెడి బ్యాటరీలా ఛార్జి అయివుంటాడు.ఎవరికైనా సందేహం వుంటే భూమా నాగిరెడ్డి మరణానికి ముందు ఆయన ఇచ్చిన కథనాలు ఎబిఎన్లోచూడండి.. చీదరించుకోండి. పత్రికల వారికి కూడా అభిమానాలుండొచ్చు గాని ఆత్మాభిమానం వృత్తిపై అభిమానం కూడా వుండాలి కదా..ఎంతకూ అధికార పక్షానికి వత్తాసు నివ్వడమే పవిత్ర కర్తవ్యమనుకుంటే ఎలా??? ఇంతకూ పేరేమంటారా?ఇంత డిస్క్రిప్షన్ తర్వాత కూడా పేరెందుకు సార్? ఒకటి రెండు సార్లుచూడండి మీకే తెలుస్తుంది..