ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అంశాన్ని ఒక ఆయుధంగా చేసుకొని రాజకీయ పార్టీలు లబ్ది పొందాలని ప్రయత్నిస్తుంటే మరోవైపు దాని కోసం సామాన్య ప్రజలు ప్రాణాలు తీసుకొంటున్నారు. రాష్ట్రంలో ఈ ప్రత్యేక ఉద్యమాలు మోదలయినప్పటి నుండి ఇంతవరకు ఐదుగురు వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. మళ్ళీ నిన్న నెల్లూరు జిల్లాలో గూడూరు మండలం చెన్నూరుగ్రామానికి చెందిన రమణయ్య (40) అనే వ్యక్తి రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదనే కారణంతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకొన్నాడు. అతను గూడూరులో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ప్రత్యేక హోదా రాలేదనే బాధతో ఆత్మహత్య చేసుకొంటున్నట్లు జిల్లా కలెక్టర్ కి మూడు లేఖలు వ్రాసాడు.