దర్శకుడిగా హ్యాట్రిక్ హిట్లు కొట్టేశారు కొరటాల శివ. మిర్చి,శ్రీమంతుడు, జనతా గ్యారేజ్.. ఒకటికి మించి ఒకటి విజయం సాధించాయి. ఇప్పుడు కొరటాల టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ ఫిల్మ్ మేకర్. త్వరలో ఆయన, మహేష్ బాబు తో మరో సినిమా చేయడానికి రంగం సిద్దం చేస్తున్న సంగతి తెలిసిందే. డి.వి.వి దానయ్య బ్యానర్ లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం మురగదాస్ తో సినిమా చేస్తున్న మహేష్, అది పూర్తికాగానే కొరటాల సినిమా లో జాయిన్ అవుతారు.
అయితే ఈలోగా పాటలను సిద్ధం చేసేపనిలో పడ్డారు కొరటాల. ఈ చిత్రానికి కొరటాల ఆస్థాన సంగీత విద్వాంసుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్న సంగతి తెలిసిందే. కొరటాల తీసిన మిర్చి,శ్రీమంతుడు, జనతా గ్యారేజ్.. ఇలా మూడు సినిమాలకు దేవినే మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు మహేష్ కొత్త సినిమాకి కూడా దేవిశ్రీనే స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. తనకు కావాల్సిన బాణీలు రాబట్టుకోవడంలో బిజీగా వున్నారు కొరటాల. ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ కు సంబధించి కొన్ని ఫోటోలను దేవిశ్రీ తన పేస్ బుక్ లో పంచుకున్నాడు. అన్నట్టు.. ఈ చిత్రానికి ‘భరత్ అనే నేను” అనే టైటిల్ ప్రచారంలో వున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ టైటిల్ ను అఫీషియల్ గా తన పేస్ బుక్ పేజిలో వెల్లడించాడు .
ఈ చిత్రానికి టాప్ సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ పనిచేయనున్నారు. మోస్ట్ వాంటెడ్ కెమరా మెన్ ఈయన. ఫనా, గజని, రబ్ నే బనాది జోడి, ఇలా బోలెడు సక్సెస్ ఫుల్ సినిమాలకు పని చేశారీయన. ఇప్పుడు మహేష్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.