143 సినిమాతో హీరో అయిపోయాడు పూరి తమ్ముడు సాయిరాం శంకర్. బంపర్ ఆఫర్ ఒక్కటే బాగా ఆడింది. దాని తరవాత, అంతకు ముందూ అన్నీ ఫ్లాపులే. తేజ లాంటి దిగ్గజంతో తీసిన వెయ్యి అబద్దాలు ఒక్కరోజు కూడా ఆడలేదు. దాంతో… సాయి చాలా గ్యాప్ తీసుకొన్నాడు.. తీసుకోవాల్సివచ్చింది కూడా. ఇంతకాలానికి ఓ సినిమా చేశాడు. అదే నేనో రకం. పూరి జగన్నాథ్ సినిమా టెంపర్‌కి ముందు అనుకొన్న టైటిల్ ఇది. అన్నయ్య టైటిల్ తమ్ముడు వాడేసుకొన్నాడు. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటి వరకూ… శంకర్ నటించిన ఏ సినిమాకి రానంత పాజిటీవ్ బజ్ తీసుకొచ్చింది నేనోరకం. టైటిల్ క్యాచీగా ఉండడం, శరత్‌కుమార్ లాంటి నటుడి అండదండలు ఉండడం ఈ సినిమాకి కలిసొచ్చింది. ఇటీవల మీడియాకు ప్రివ్యూ షో కూడా వేశారు. చూసినవాళ్లంతా పాజిటీవ్‌గా స్పందిస్తున్నారు. సెకండాఫ్ బాగుందని, శరత్ కుమార్ ఈ సినిమాని సింగిల్ హ్యాండ్‌తో తన వైపుకు తిప్పుకొన్నాడన్నది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. ఓ సమకాలీన సమస్యని దర్శకుడు చాలా సమర్థవంతంగా డీల్ చేశాడని, చూస్తుంటే… సాయిరాం శంకర్ హిట్టు కొట్టేలానే ఉన్నాడని.. ఈవారం వస్తున్నవన్నీ చిన్న సినిమాలే కావడం సాయికి కలిసొచ్చే విషయమని… ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. మరి.. పూరి తమ్ముడి నిరీక్షణ ఫలించి అన్వేషణ తగిన ఫలితాన్ని ఇస్తుందో లేదో చూడాలి.