సినీయర్ హీరోయిన్ జయసుధ జీవితంలో పెను తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకోవడం పెను విషాదం నింపింది. ఈ విషాదం పై జయసుధ తొలిసారి స్పందించారు. ఈ రోజు (మార్చి 17) జయసుధ పెళ్లి రోజు. 32 ఏళ్ల క్రితం ఇదే రోజున జయసుధ, నితిన్కపూర్ ఒకటయ్యారు. ఈ సందర్భంగా తన మనోగతాన్ని ఫేక్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు జయసుధ.
‘ఆయన ఇప్పుడు దేవతలతో ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆయన వెతికిన శాంతి ఇప్పుడు ఆయనకు దొరికింది. డిప్రెషన్ అనేది చాలా క్రిటికల్ మెడికల్ కండిషన్. మా కుటుంబ ప్రైవసీని గౌరవించి ఈ విషయాన్ని సంచలనాత్మకం చేయకుండా సంయమనం పాటించిన మీడియాకు నా ధన్యవాదాలు. 32 ఏళ్ల కిత్రం ఇదే రోజున ఒకటయ్యాం. ఆయన సహచర్యంలో గడిపిన మధుర క్షణాలు నాకు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నా ప్రేమతో మమ్మల్ని కాపాడుతూనే ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా. ఈ విషాద సమయంలో నాకు, నా కుటంబానికి మద్దతు ప్రకటించిన ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు’ అంటూ తీవ్ర ఉద్వేగంతో కూడిన సందేశాన్ని పంచుకున్నారు జయసుధ.