నిఖిల్ ని ప్రామెసింగ్ హీరోగా నిలబెట్టిన చిత్రం ”స్వామీరా రా’.అప్పటివరకూ అసలు వున్నాడా లేడా అన్నట్లు సాగిన నిఖిల్ కెరీర్.. ”స్వామీరా రా’ సినిమాతో స్వింగ్ లోకి వచ్చింది. ఈ సినిమాతోనే దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ వర్మ. తొలి సినిమాతోనే భలే దర్శకుడు అనిపించుకున్నాడు. డిఫరెంట్ క్రైమ్ కామెడీ తీశాడు అనే ప్రసంసలు అందుకున్నాడు. ఈ సినిమా మంచి లాభాలూ తెచ్చిపెట్టింది. అయితే ద్వితీయ విజ్ఞాన్ని దాటలేకపోయాడు సుదీర్. నాగచైతన్య తో తీసిన దోచేయ్ సినిమా దారుణంగా పల్టీ కొట్టింది. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న సుధీర్ ఇప్పుడు మళ్ళీ నిఖిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు అదే .. కేశవ. తాజగా ఈ సినిమా టీజర్ బయటికివచ్చింది. ఈ సినిమా ఒక రివెంజ్ డ్రామాని మొదటే చెప్పారు. చెప్పినట్లే అడుగడుగునా రివెంజే కనిపించింది టీజర్ లో.
‘భూతాన్ని.. యజ్ఞోపవీతాన్ని.. వైప్లవ్య గీతాన్ని నేను.. స్మరిస్తే పద్యం.. అరిస్తే వాద్యం.. అనల వేదిక ముందు అస్ర నైవేద్యం’ అంటూ శ్రీశ్రీని గుర్తు చేస్తూ ఈ టీజర్ ఓపెన్ చేశారు. రివెంజ్ మాట ఏమిటో గానీ టీజర్ లో రక్తపాతం మరీ ఎక్కువైయింది. ప్రతీ షాట్ లో రక్తం మరకలే కనిపించాయి. నిఖిల్ లుక్ కూడా కొత్తగానే వుంది. ఇది వరకు ఎప్పుడు ఇలా కనిపించలేదు నిఖిల్. టీజర్ చూస్తుంటే కేశవ నిఖిల్ కు నప్పుతుందా? అనే సందేహం కలగకమానదు. అంత హెవీగా వుంది టీజర్. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రమిది. మంచి టెస్ట్ వున్న సంస్థగా పేరుంది అభిషేక్ పిక్చర్స్ కి. సో.. ‘కేశవ’ లో కూడా ఏదో విషయం వుండే వుటుంది.