కమల్ హాసన్ రెచ్చిపోతున్నాడు. నిజానికి ఆయనను అలా రెచ్చగొట్టింది మన మీడియానే. నిజానికి సినిమాల వరకూ చూసుకుంటే కమల్ మేధావి. సాంకేతిక విషయాల కంటే నటన విషయంలో ఇంకా గొప్పవాడు. మన మీడియా ఆయన గొప్పతనాన్ని అంతవరకే పరిమితం చేసి ఉంటే బాగుండేది. కానీ మనవాళ్ళకు అలా చేతకాదు. యాడ్స్ తీసుకున్నప్పుడు…అలాగే కమల్ అభిమానులను ఇంప్రస్ చేయాలనుకున్నప్పుడు…అలాగే కమల్ హాసన్ గొప్పతనాన్ని పొగడడంలో మనం ఎక్కడ వెనుకపడిపోతామో అన్న ఆలోచన వచ్చినప్పుడు అంతూ పొంతూ లేకుండా పొగడ్తల వర్షం కురిపిస్తుంది. ఆయన ఒక సర్వజ్ఙాని అనే స్థాయిలో ప్రొజెక్ట్ చేస్తుంది. ఇక కమల్ హాసన్ తమకు వ్యతిరేకంగా ఉండే నాయకులపైన నాలుగు పొలిటికల్ డైలాగ్స్ పేల్చినప్పుడు కూడా మన భజన మీడియాను అస్సలు ఆపలేం. కమల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. అఫ్కోర్స్….తేడా వస్తే పాతాళానికి తొక్కేయడం కూడా మన మీడియాకు చిటికెలో పని. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం మీడియా కమల్ హాసన్‌ని ఆకాశానికి ఎత్తేసింది. పొగడ్తలకు పడని మనిషి ఎవడుంటాడు? అది కూడా సినిమావాళ్ళు అయితే మరీను. ఇప్పుడు కమల్ కూడా ఆ పొగడ్తల మైకంలోనే ఉన్నట్టున్నాడు. ఇష్టం వచ్చిన స్టేట్మెంట్స్ పడేస్తున్నాడు.
ప్రపంచంలో ఉన్న అన్ని మత గంథాలలోనూ మంచి, చెడూ రెండింటి ప్రస్తావనా ఉంది. అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి ఆ మంచి చెడుల విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. కానీ కమల్ మాత్రం హిందూ మతంపైన తనకు ఉన్న వ్యతిరేకతను బహిరంగంగానే ప్రదర్శిస్తున్నాడు. మహాభారతంలో స్త్రీలను ఫణంగా పెట్టి జూదమాడినట్టుగా చదివిన ప్రజలను ప్రాంతమిది. అందుకే అత్యాచారాలు జరుగుతున్నాయి అన్న అర్థం వచ్చేలా తనకు తోచింది మాట్లాడేశాడు కమల్. మరి ఆ అత్యాచారాలు ఒక్క భారతదేశంలోనే జరుగుతున్నాయా? ప్రపంచంలో ఇంకెక్కడా జరగడం లేదా? ఏ మతం వాళ్ళు ఉన్న ప్రాంతంలో అత్యాచారాలు జరగడం లేదో కమల్ హాసన్ చెప్పగలరా? అయినా భారతదేశంలో ఉన్న హిందువులు మాత్రమే అత్యాచారాలకు పాల్పడుతున్నారా? మిగతా మతాలవాళ్ళు చేసేవాటి గురించి కమల్ స్పందన ఏంటో? ఇక కమల్ హాసన్‌కి మహిళల పట్ల ఉన్న గౌరవం ఎంతో ఆయన వ్యక్తిగత జీవితాన్ని దగ్గరగా చూసిన సినిమావాళ్ళు కథలు కథలుగా చెప్తూ ఉంటారు. కొన్ని సినిమాలలో స్త్రీ పాత్రలను సెక్స్‌కి పనికొచ్చే వస్తువు అనే స్థాయిలో తీర్చిదిద్దిన చరిత్ర కమల్‌కి ఉంది. కమల్ నటించిన అలాంటి సినిమాలు సమాజానికి ఏం సందేశం ఇచ్చినట్టు? అయినా నాలుగు మంచి మాటలు మాట్లాడితే చాలు……ఇక ఆ సినిమా హీరోలు మేధావులు, సొసైటీ అంటే పడిచచ్చిపోతారు, సొసైటీని తీర్చిదిద్దడానికే బ్రతుకుతున్నారు….24 గంటలు అవే ఆలోచనలతో ఉంటారు….అట్టే మాట్లాడితే సొసైటీని మార్చడానికి పుట్టిన అవతార పురుషులు అనే స్థాయిలో సినిమా వాళ్ళ భజన చేసే మీడియా వాళ్ళను అనాలి. హిందూ పురాణాల్లో ఉన్న తప్పులను కమల్ హాసన్ బాగానే చెప్తున్నారు. మరి అదే పురాణాల్లో ఉన్న మంచి కమల్‌కి కనిపించదా? ఎక్కడ స్త్రీలను పూజిస్తారో…అక్కడ దేవతలు ఉంటారని కూడా అదే పురాణాలు చెప్పాయిగా. ఎవరు ఏం చూడాలనుకుంటే అదే కనిపిస్తుంది అని కూడా అదే పురాణాల్లో ఓ గొప్ప నీతి ఉంది. కమల్ హాసన్ కేవలం పడక సుఖాన్ని చూడడమే పనిగా పెట్టకున్నట్టున్నాడు. అందుకే పురిటి నొప్పుల నీతి ఆయనకు కనిపించడం లేనట్టుగా ఉంది.