`శ్రీకాంత్ నా సొంత తమ్ముడులాంటివాడు.. నాగబాబు, కల్యాణ్ ఎంతో… నాకు శ్రీకాంత్ అంత`… ఈ మాట చిరంజీవి నోటి నుంచి చాలాసార్లు విన్నాం. శ్రీకాంత్‌తో చిరుకి ఉన్న అనుబంధం అలాంటిది. చిరుఫ్యాన్ గా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన శ్రీకాంత్ అడుగడుగునా…. శ్రీకాంత్‌పై తన అభిమానాన్ని చాటుకొంటూనే వస్తున్నాడు. శంకర్‌దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ లలో ఏటీఎమ్‌గా కనిపించి… మెప్పించాడు. ఇప్పుడు మరోసారి చిరుతో కలసి నటించే అవకాశం వచ్చిందట. చిరు 151వ చిత్రం `ఉయ్యాల వాడ నరసింహారెడ్డి`కోసం భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో శ్రీకాంత్‌కీ ఓ కీలక పాత్ర దక్కిందని తెలుస్తోంది. శ్రీకాంత్ ఈమధ్య గెడ్డం పెంచి డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. శ్రీకాంత్ కసరత్తు.. ఉయ్యాల వాడ కోసమే అన్నది టాలీవుడ్ సమాచారం.
అన్నట్టు… ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కూడా నటించనున్నాడని ఓ గాసిప్ షికారు చేస్తోంది. అయితే… చిత్రబృందం నుంచి అధికారిక సమాచారం ఏమీ లేదు. ప్రస్తుతం రాబో 2లో నటిస్తున్నాడు అక్షయ్ కుమార్. చిరు సినిమా కూడా ఒప్పుకొంటే.. దక్షిణాదిన అక్షయ్ చేయబోయే రెండో సినిమా ఇది. ఏప్రిల్ నుంచి చిరు 151వ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించే ఈ చిత్రానికి రామ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.