నానికి ఇండ్రస్ట్రీలో మంచి పేరుంది. అందరితోనూ సరదాగా ఉంటాడని, గర్వం అస్సలు ఉండదని, ఇండ్రస్ట్రీలో తనకి హీరోలెక్కువని అంటుంటారు. కానీ అలాంటి నాని హీరోలపై సెటైర్లు వేస్తానంటున్నాడు. అదీ… ఓ అవార్డు వేడుకలో. ఐఫా అవార్డుల వేడుక మంగళ, బుధ వారాల్లో హైదరాబాద్‌లో జరగబోతోంది. బుధవారం తెలుగు సినీ ఇండ్రస్ట్రీకి సంబంధించిన అవార్డులు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి నాని – రానాలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. రానాకి యాంకర్‌గా మంచి అనుభవం ఉంది. ఇది వరకు కొన్ని ఈవెంట్స్‌లలో యాంకరింగ్ చేశాడు. నానికి ఇలా హోస్ట్‌గా మారడం బొత్తిగా కొత్త. అందుకే కాస్త వైవిధ్యం చూపించాలన్న తపనతో కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నార్ట.
”నాకు హోస్టింగ్ చేయడం ఇదే తొలిసారి. అందుకే కాస్త కొత్తగా ఉండాలని భావిస్తున్నా. మన అవార్డు వేడుకలన్నీ సంప్రదాయ బద్దంగా జరుగుతాయి. ఆ రూల్‌ని బ్రేక్ చేద్దామని నేనూ, రానా డిసైడ్ అయ్యాం. హీరోలపై సెటైర్లు వేయబోతున్నాం. ఎవరైనా ఫీలైతే ముందుగా సారీ చెప్పేస్తా. అవార్డు వేడుకలు సరదాగా సాగాలంటే… ఇలాంటి వాతావరణం ఉండాల్సిందే. హీరోల మధ్య ఎంత ఫ్రెండ్ షిప్ ఉందో… ప్రేక్షకులకూ తెలుస్తుంది” అంటున్నాడు నాని. ఐఫా వేడుకలో అఖిల్, సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్, లక్ష్మీరాయ్, హన్సిక, రాశీఖన్నా… వీళ్లంతా తమ డాన్సులతో అదరగొట్టబోతున్నారు. గతేడాది ఐఫా వేడుకపై అఖిల్ డాన్సులు ఇరగదీశాడు. ఈసారీ.. అఖిల్ డాన్స్ పెర్ఫార్మ్సెన్ ఇవ్వబోతున్నాడు. అందుకే అందరి దృష్టీ యాంకరింగ్ చేయబోతున్న నాని.. స్టెప్పులు వేసే అఖిల్‌లపై పడింది. వారిద్దరూ ఎంత వరకూ ఆకట్టుకొంటారో చూడాలి.