యువ కథానాయకుడు నానికి ఈ ఉగాది ఓ మరపురాని కానుక ఇచ్చింది. ఈరోజే నాని నాన్నయ్యాడు. ఉగాది సంబరాల్ని రెట్టింపు చేస్తూ..! నాని – సంజనలకు ఐదేళ్ల క్రితం పెళ్లయ్యింది. సంజనకు ఈరోజు ఉదయం హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో పండండి మగబిడ్డ జన్మించాడు. తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ యేడాది నానికి వరుస విజయాలే. నేను లోకల్ సూపర్ హిట్ అయ్యింది. నంది అవార్డు కూడా వచ్చింది. ఈరోజు ఐఫా ఉత్సవాల్లో నాని తొలిసారి యాంకరింగ్ చేయబోతున్నాడు. ఇలా ఈ హీరోకి అన్నీ కలసొచ్చేస్తున్నాయి. ఉగాది రోజున నాన్న కావడం.. నాని సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. కంగ్రాట్స్ టూ నాని. ప్రస్తుతం నాని నిన్ను కోరి అనే చిత్రంలో నటిస్తున్నాడు. చిత్రీకరణ కూడా దాదాపుగా పూర్తయినట్టే. త్వరలోనే ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.