పవన్ కళ్యాణ్ ను కొత్తగా చూపించిన దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ‘జల్సా’తో పవన్ కళ్యాణ్ లోని కొన్ని డిఫరెంట్ కోణాలు అవిష్కారించాడు త్రివిక్రమ్. అప్పటివరకూ కనిపించిన పవన్ కు జల్సాలో కనిపించిన పవన్ కు చాలా తేడాలు వుంటాయి. స్టయిల్ లో కానీ డైలాగ్ మ్యాడ్యులేషన్ గానీ స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి. ఇక ‘అత్తారింటికి దారేది’ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ మరింత స్టయిలీష్ గా పాష్ గా చూపించాడు త్రివిక్రమ్. ఇప్పుడు వీరికలయికలో మూడో సినిమా రాబోతుంది. హారిక హాసిని క్రియేషన్ పై చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమా రేపే సెట్స్ పైకి వెళ్లనుంది. కాటమరాయుడు థియేటర్ లోకి వచ్చి ఇంకా రెండు వారాలు కూడా గడవలేదు. అప్పుడే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి రెడీ అయిపోతున్నారంటే ఫ్యాన్స్ ఖుషి అయిపోవాల్సిన న్యూసే.
అయితే ఇక్కడో పాయింట్ వుంది. అదే పవన్ కళ్యాణ్ లుక్. కాటమరాయుడులో పవన్ కళ్యాణ్ కొంచెం బొద్దుగా కనిపించాడు. ఆయన పేస్ కట్ లో ఫ్యాట్ స్పష్టంగా కనిపించింది. పవన్ కళ్యాణ్ అందానికి వంకపెట్టలేం. అయితే పేస్ లో ఫ్యాట్ వున్నట్లుకనిపిస్తే స్క్రీన్ ప్రెజెన్స్ కి ఇబ్బందిగా వుటుంది. కాటమరాయుడు షూట్ జరుగుతున్నంత కాలం పవన్ ..ఫిట్ నెస్ కు పెద్ద ప్రాధన్యత ఇవ్వలేదు అనే సంగతి అర్ధమౌతుంది. పొలిటికల్ టూర్లు, అమెరికా పర్యటన.. ఇలా ప్రయాణాలు కట్టేశారు. దీంతో డైట్ చెడుంటుంది. ఆ ప్రభావం కాటమరాయుడిలో కనిపించింది. జనరల్ గా ఒక సినిమా తర్వాత బెంగళూర్ వెళ్లి అక్కడ జిమ్ లో వర్క్ అవుట్స్ చేసి మళ్ళీ ఫిట్ నెస్ సాధించం పవన్ కు ఓ అలవాటు. అయితే ఈసారి ఆయన దానికి కోసం టైం కేటాయించకుండా జనరల్ గానే త్రివిక్రమ్ సెట్స్ లో అడుగుపెట్టెస్తున్నారు. మరి ఈసారి పవన్ లుక్ విషయంలో త్రివిక్రమ్ సైడ్ నుండి ఏవైనా స్పెషల్ కేర్లు తీసుకుంటారా? లేదా అదే లుక్ తో షూటింగ్ కానించేస్తారో చూడాలి.