ఏ చెట్టూ లేని చోట ఆముద చెట్టే మహా వృక్షం – అంటుంటారు. ఇప్పుడు కాటమరాయుడుదీ అదే పరిస్థితి. గతవారం విడుదలైన కాటమరాయుడు… ఫస్ట్ డే డివైడ్ టాక్ తెచ్చుకొని – ఆ తరవాత ఫ్లాప్ దగ్గర నిలబడిపోయింది. తొలి రోజు వసూళ్ల ఊపు ఆ తరవాత కనిపించలేదు. ఉగాది రోజున మాత్రం కాటమరాయుడు వసూళ్లు కాస్త తేరు కొన్నాయి. పండగ కావడం, ఆ రోజు థియేటర్ దగ్గర మరో ఆప్షన్ లేకపోవడంతో.. కాటమరాయుడు క్యాష్ చేసుకొంది. సరిగ్గా ఇప్పుడు అదే పరిస్థితి ఈ వారం కూడా ఎదురైంది.
ఈ వారం గురు, రోగ్ విడుదలయ్యాయి. గురు డీసెంట్ రివ్యూస్ ని సంపాదించుకొంది. మల్టీప్లెక్స్‌లలో గురు ప్రభావం చూపించే అవకాశం ఉంది. రోగ్ కి నెగిటీవ్ టాక్ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దాంతో పాటు… ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి పూర్తిగా దూరం అయ్యారు. ఊర `సీ` సెంటర్లలో రోగ్‌కి వసూళ్లు రావొచ్చు. అయితే… ఏ, బీ సెంటర్లు మళ్లీ కాటమరాయుడపై ఆధారపడేట్టు తప్పడం లేదు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో సినిమా అంటే.. ఓ వర్గానికే చేరువ అవుతుంది. రోగ్కూడా అంతే. ఈ మైనస్సులు కాటమరాయుడికి ప్లస్ అవ్వొచ్చు. కుటుంబ సమేతంగా సినిమా చూడాలంటే ఇప్పటికీ కాటమరాయుడికే అవకాశాలు ఎక్కువ. శని, ఆదివారాల్లో కాటమరాయుడు మళ్లీ పుంజుకోవొచ్చన్నది టాలీవుడ్ విశ్లేషకుల మాట. ఎంత పుంజుకొన్నా… కాటమరాయుడు నష్టాలు భర్తీ కాకపోవొచ్చు. గుడ్డిలో మెల్లలా అన్నమాట. బయ్యర్లకు కాస్త ఊరట కలిగించే వసూళ్లు ఈ శని, ఆదివారల్లో చూసే అవకాశం ఉంది. మరి కాటమరాయుడు ఎలా క్యాష్ చేసుకొంటాడో..?