ప్రేక్షకుల మైండ్ సెట్ ఓ పట్టాన అర్థం కాదు. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ ప్రేక్షకుల నాడీ పట్టుకోవడం చాలా కష్టం. అక్కడంతా క్లాస్ సినిమాలదే రాజ్యం. అయితే అప్పుడప్పుడూ… మాస్ చిత్రాలకూ బ్రహ్మరథం పడుతుంటారు. రివ్యూలు చూసి సినిమాకెళ్తారని ఓవర్సీస్ ప్రేక్షకులపై ఓ ముద్ర ఉంది. అయితే కొన్ని కొన్ని సార్లు వాటినీ పట్టించుకోరు. `గురు` విషయంలో అదే జరుగుతోంది. ఇదో క్లాస్ సినిమా అనే ముద్ర పడిపోయింది. దానికితోడు వెంకీ హీరో. ఓవర్సీస్లో ఈ సినిమా దుమ్ము దులపడం ఖాయం అనుకొన్నారంతా. కానీ సీన్రివర్స్ అయ్యింది. గురుని అక్కడ పట్టించుకొనేవాళ్లే కనిపించడం లేదు.
కాటమరాయుడు వసూళ్లు డ్రాప్ అయిన నేపథ్యంలో `గురు` లైన్ క్లియర్ అవుతుందని ఆశించారంతా. కానీ అదేం జరగలేదు. తొలి వారంతంలో 1.4 లక్షల డాలర్లు మాత్రమే వసూలు చేసింది గురు. ఈ సినిమాపై వచ్చిన పాజిటీవ్ బజ్.. వెంకీ మార్కెట్, అంచనాలతో పోలిస్తే… ఈ అంకెలు ఏ విధంగానూ సంతృప్తి పరచడం లేదు. సాలాఖడూస్ సినిమాని ఆల్రెడీ అక్కడ చూసేయడం, గురు సినిమాకి మక్కీకి మక్కీ దింపేయడం వల్ల ఓవర్సీస్ ఆడియన్స్ ఈ సినిమాని లైట్ తీసుకొన్నారేమో అనిపిస్తోంది. వీక్ డేస్ లో ఎలాగూ.. ఓవర్సీస్లో టికెట్లు తెగడం కష్టం. సో.. `గురు` తేరుకోవడం కష్టమే.