మొన్నటి విస్తరణలో పదవి దక్కనందుకు మరీ ఎక్కువ బాధపడుతున్న వారిలో ధూళిపాళ నరేంద్ర ఒకరు. చాలారోజులుగా అధికార పక్షంలో వినిపిస్తున్నగొంతు. చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చారని కూడా చెప్పుకున్నారు.అయితే గుంటూరు జిల్లాలోని సంగం డైరీ వ్యవహారాలు ఆయనకు పదవి యోగం లేకుండా చేశాయని టిడిపి నేతలంటున్నారు.దాన్ని పూర్తిగా గుప్పిట్లో పెట్టుకున్న నరేంద్ర ఒక దశలో చంద్రబాబు మాట కూడా వినకుండా ఇష్టానుసారం ప్రైవేటీకరించారు. పార్టీలో ఇతర నేతలకు అసలు స్థానం లేకుండా చేశారు.దాంతో ఆయనకు గనక పదవిఇస్తే వూరుకునేది లేదని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు అల్టిమేటం ఇచ్చారట. దాంతో చంద్రబాబుకు కూడా ఒక సాకు దొరికింది.ఆయనకూ కోపం వుంది.పైగా పత్తిపాటి పుల్లారావును కొనసాగిస్తూమరో పదవి అదే వర్గానికి ఇవ్వడం సాధ్యం కాని పని అనినిర్ణయానికి వచ్చారు. రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పాలనుకుంటే నరేంద్ర స్థానికంగా కొంత పట్టు సడలించుకోవాల్సింది. ఏమైతేనేం ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి వూరిస్తున్న మంత్రి పదవి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.