అసలే మీలో ఎవరు కోటీశ్వరుడు పోగ్రాంకి ఉన్న రేటింగులు అంతంత మాత్రమే. ఇప్పుడు.. తాజాగా ఈ షో సాగిన వ్యవహారం విమర్శకులకు తావిస్తోంది. ఇటీవల బ్రహ్మానందంతో ఓ స్పెషల్ ఎపిసోడ్ చేశాడు చిరు. ఈ షో ఆద్యంతం రక్తికట్టించినా… జంథ్యాల ఎపిసోడ్ మాత్రం వివాదం అవుతోంది. బ్రహ్మీకి సినీ గురు.. జంథ్యాల. ఆయన్ని గుర్తు చేసుకొంటూ… ఓ వేదికపై జంథ్యాల తాగొచ్చారన్న అర్థం వచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు అదే కొంతమందికి కోపం తెప్పించింది. జంథ్యాలతో అనుబంధం ఉన్న కొంతమంది నటీనటులు, దర్శకులు బ్రహ్మానందానికి ఫోన్ చేసి.. ”మీకిదితగునా? జంథ్యాల గురించి అలా మాట్లాడొచ్చా” అంటూ నేరుగానే అడిగేశార్ట.
అంతేకాదు.. జంథ్యాల సతీమణి అన్నపూర్ణ రంగంలోకి దిగారు. ”నా భర్తకు ఆల్కహాల్ అలవాటు లేదు. అలాంటి వ్యక్తి గురించి ఇలా మాట్లాడొచ్చా.. చనిపోయిన వ్యక్తిని చిన్న పరచడం భావ్యం కాదు” అంటూ బ్రహ్మానందానికి క్లాస్ పీకారు. దాంతో… జంథ్యాలకు సంబంధించిన ఆ చర్చని మాటీవీ వాళ్లు తొలగించినట్టు తెలుస్తోంది. జంథ్యాలని గురువుగా చెప్పుకొనే బ్రహ్మానందానికి ఒక విధంగా ఇది ఇబ్బందికలిగించే విషయమే. పబ్లిక్‌లో మాట్లాడేముందు.. కాస్త జాగ్రత్తగా ఉండాలంటారు అందుకే మరి.