టాలీవుడ్ లోని సీరియర్ మోస్ట్ కథానాయికల్లో అనుష్క కూడా ఉంటుంది. ఇండ్రస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు దాటేసింది. వయసు ప్రభావం వల్ల.. కాస్త ముదురుగానూ కనిపిస్తోంది. పెళ్లీడి వచ్చి.. వెళ్లిపోతోంది కూడా. అనుష్క పెళ్లి చేసుకోబోతోందన్న వార్త… కొన్నాళ్లుగా హల్చల్ చేస్తోంది. కానీ స్వీటీ మాత్రం పెళ్లి కబురు చెప్పడం లేదు. అనుష్కకి పెళ్లి ఖాయమైపోయిందని, త్వరలోనే పెళ్లికూతురుగా చూడబోతున్నామనే వార్త ఈమధ్య గట్టిగా వినిపిస్తోంది. ఇదే విషయం అనుష్కని అడిగితే.. కాస్త సీరియస్ అయ్యింది. ‘పెళ్లి టాపిక్ తప్ప… ఇంకేం ఉండదా’ అన్నట్టు చూసింది.
”పెళ్లి చేసుకోపోతే ఇంకేం లేదా?? కథానాయికల దగ్గర పదే పదే పెళ్లి ప్రస్తావన తీసుకొస్తారెందుకు?? పెళ్లి విషయంలో అందరిలా మేమూ ఆలోచిస్తాం. కానీ.. అన్నీ కుదరాలి కదా? ఇదేం సినిమా కాదు, కథ విని… రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసేసుకోవడానికి. దేనికైనా టైమ్ రావాలి..” అంటూ చిరుబురులాడుతోంది. ఇది వరకు ఎప్పుడూ, ఏ ప్రశ్నకీ సీరియస్ అవ్వని అనుష్క… ఈసారి మాత్రం ఎందుకిలా స్పందించిందో. త్వరలో బాహుబలి ప్రమోషన్లు ఉదృత స్థాయికి చేరుకోబోతున్నాయి. ఈసందర్భంగా మీడియా ముందుకు అనుష్క రావాల్సిందే. అప్పుడు ‘పెళ్లి’ క్వశ్చన్ రిపీట్ అవ్వక మానదు. మరి.. అప్పుడెలా స్పందిస్తుందో చూడాలి.