జాతీయ అవార్డుల్లో పక్షపాతం, జ్యూరీ చేస్తున్న అన్యాయం గురించి ప్రముఖ దర్శకుడు మురుగదాస్ గళం విప్పారు. ఇప్పుడు ఆయనకు తాప్సి తోడైంది. జాతీయ అవార్డుల విషయంలో గుర్రుగా ఉంది తాప్సి. గ్రూపులు కట్టి, రికమెండీషన్లు చేయించుకొన్నవాళ్లకీ, సిఫార్సులు ఉన్నవాళ్లకీ మాత్రమే అవార్డులు వస్తాయని వాపోతోంది. ఇంతిలా ఎందుకు ఫిలైపోతోంది చెప్మా…?? అనుకొంటున్నారా? తాప్సి నటించిన `పింక్` చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డుల్నీ అందుకొంది. అమితాబ్‌తో ధీటుగా నటించిన తాప్సిని పొగడ్తలతో ముంచెత్తారంతా. ఈ సినిమాకి ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు… ఇలా గంపెడు జాతీయ అవార్డులు వస్తాయని భావించారు. కానీ… జాతీయ అవార్డుల విషయంలో పింక్‌కి మొండి చేయి మిగిలింది.
దాంతో తాప్సి విమర్శనాస్త్రాలు సంధించడం మొదలెట్టింది. అవార్డుల విషయంలో ఓ కథానాయిక ఘాటుగా స్పందించడం ఇదే తొలిసారి. దాంతో తాప్సి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకొన్నాయి. మున్ముందు ఇంకెంత మంది విమర్శనాస్త్రాలు సంధిస్తారో చూడాలి.