బ్రహ్మానందం.. ఇప్పుడు బ్రహ్మీతాత అయ్యారు. ఆయన తనయుడు గౌతమ్ – జోత్స్య దంపతలకు మంగళవారం పండంటి మగబిడ్డ జన్మించాడు. దాంతో.. గౌతమ్కి పుత్రోత్సాహం, బ్రహ్మీకి తాతోత్సాహం కలిగాయి. పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో గౌతమ్ టాలీవుడ్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సరిగా ఆడలేదు. ఆ తరవాత చేసిన వారెవా కూడా ఫ్లాప్ అయ్యింది. చాలా గ్యాప్ తరవాత బసంతితో మెరిశాడు. అదీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మను అనే ఓ చిత్రంలో నటిస్తున్నాడు. చాందిని చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఫణీంద్ర దర్శకుడు. షూటింగ్ పూర్తయిపోయింది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. తండ్రయ్యాకైనా గౌతమ్ జాతకం మారుతుందేమో చూడాలి.