టిఆర్ఎస్ కీలక నేత, మంత్రి హరీష్ రావుతో ఆర్కే ఓపెన్ హార్ట్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. కెసిఆర్ గనక కెటిఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే హరీష్ ఒప్పుకుంటాడా లేదా అని ఆర్కే ఒకటికి పదిసార్లు అడగడం, అదే ఆయన నిర్ణయమైతే తప్పక ఆమోదిస్తానని హరీశ్ చెప్పడం అందరూ చూశారు. ఇది రాజకీయంగా హరీశ్ లొంగుబాటు సంతకం అనేవారు వున్నారు, తెలివైన వాడెవరైనా అదే చేస్తారని చెప్పేవారూ వున్నారు. కెసిఆర్ తన కుమారుడు కెటిఆర్‌ను ముందుకు తెస్తున్న మాట నిజమే అయినా దానికి హరీశ్‌ను ఇంత ముందస్తుగా ఒప్పించవలసిన అవసరం వుందా అని రాజకీయ వర్గాల్లో ప్రశ్నలు వచ్చాయి. వాస్తవానికి ఆయనను ఈ ఓపెన్హార్ట్కు ఆర్కే ఆహ్వాన్ణిస్తున్నా దాటవేస్తూ వచ్చారట. ఇది రెండవదో మూడవదో కూడా. ఒకసారి వెళ్లి కూచున్నాక వచ్చే ప్రశ్నలు తెలుసు గనక హరీశ్ కాదని చెప్పకుండా కాలక్షేపం చేస్తూ వచ్చారు. చాలామందితో ఫోన్లు చేయించినా వినకపోవడంతో కెసిఆర్ బంధువు ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యసూత్రధారి అయిన వ్యక్తితో ఫోన్ చేయించి వొప్పించారు. ఇంతకూ కెసిఆర్ వెళ్లమన్నారని చెప్పించి వుండకపోతే ఈయన వెళ్లేవారు కాదని అంచనా. ఇంటర్వ్యూలో ఫ్రధానంగా కెటిఆర్‌కు నాయకత్వం అప్పగించడంపైనే ప్రశ్నలువేయడం, ఆయన కూడా చేతులెత్తేస్తున్నట్టు మాట్లాడ్డంతో ఒక ఘట్టం ముగిసింది. ఇది లొంగుబాటేనని అని కొందరు, అంతగా లోంగిపోయి మాట్లాడవలసింది కాదని ఇంకొందరు, ఇలా అన్నప్పటికీ హరీష్ తన పని తాను చేసుకుపోతూనే వుంటాడని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏమైనా కెసిఆర్ తర్వాత కెటిఆర్ అన్నది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయింది. వచ్చే ఎన్నికల తర్వాత ఆయనతోనే ప్రమాణ స్వీకారం చేయించినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.
అయితే అక్కడ దాకా వచ్చేప్పటికి హరీశ్ మొదట సర్దుకున్నా శాశ్వతంగా సర్దుకోలేదనే అభిప్రాయం వుంది.ఎన్టీఆర్ విసయంలో చంద్రబాబు చేసినట్టే ఒక సమయం చూసి హరీశ్ తిరుగుబాటు చేస్తారని అప్పుడు ఆయనతో ఎంఎల్ఎలు బాగానే వెళతారని ఒక అంచనా చెబుతున్నారు.అలాటి పరిస్థితిని రానివ్వద్దనే కెసిఆర్ కొడుకును పైకి లేపినా ఎప్పటికప్పుడు హరీశ్‌కు ప్రాధాన్యత నిస్తున్నట్టు కనిపిస్తుంటారని, ఇటీవల వరసుగ అధికార పత్రికలో ా ఆయన పేరు, ఫోటోలు ప్రముఖంగా రావడం, వరంగల్ సభల పర్యవేక్షణకు పంపడం అంతా ఒక బుజ్జగింపు తతంగమేనని మీడియా వర్గాలంటున్నాయి. ఇందుకు ఆర్కే సాధనం కావడం వల్ల ఆయన వ్యక్తిత్వం కూడా దెబ్బతిన్నట్లవుతుందని కూడా వారు వ్యాఖ్యానించారు.