విజయవాడ రాజకీయాల్లో సంచలనాత్మకమైన పరిణామం శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడమే దీనికి కారణంమైంది. దీనితో ఊహాగానాలు మొదలయ్యాయి. విజయవాడ ఎంపీ కేశినేని నానితో ఇటీవలి కాలంలో ఎదురవుతున్న ఇబ్బందులు చంద్రబాబును ఆలోచింపజేస్తున్నాయి. ఆయన్ను వదిలించుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి వ్యూహం రచించారంటున్నారు. ఇటీవలి కాలంలో చంద్రబాబును ప్రశంసిస్తూ ప్రకటనలు చేస్తున్న లగడపాటి వైఖరి కూడా దీనికి తోడయ్యింది. విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి రెండు సార్లు గెలుపొందిన రికార్డు లగడపాటి సొంతం. 2019 విజయవాడ ఎంపీ సీటు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అమరావతిలోని వెలగపూడిలో ఉన్న సచివాలయంలో లగడపాటి శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రిని కలిశారు. ఈ కలయిక రాజకీయ వర్గాలలో సంచలనాన్ని రేకెత్తిస్తోంది. ల్యాంకో పవర్ ప్లాంట్‌కు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రిని కలిశారని ఫీలర్. ఎన్నికల ఫలితాలపై ఆయన నిర్వహించే ఎగ్జిట్ పోల్స్‌తో లగడపాటికి విశేషమైన ఆదరణ లభిస్తోంది.
Subahmanyam Vs Kuchimanchi