కొంతమందికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా నిలబెట్టుకోలేరు. వరుసగా ఫ్లాపుల ఇచ్చినా ఎదో నమ్మకంతో బలంగా నమ్మి సినిమాని చేతిలో పెడుతుంటారు. అయితే ఇలా పెట్టుకున్న నమ్మకాన్ని వొమ్ము చేస్తుంటారు కొందరు. ఇప్పుడీ లిస్టు లో దర్శకుడు శ్రీను వైట్లను చేర్చుకోవాలి. మరి ఇలా నమ్మి దెబ్బైపోయినది ఎవరంటే… మెగా ఫ్యామిలీనే.
శ్రీనువైట్ల పీక్స్ లో వున్నపుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. వీరిద్దరి కలయికలలో ‘అందరివాడు’ వచ్చింది. ఈ సినిమా పల్టీకొట్టేసింది. అయితే ఆ ఫ్లాపును పక్కనే పెట్టి, ఆగడు లాంటి డిజాస్టర్ వున్నప్పటికీ రామ్ చరణ్ ను వైట్ల చేతిలో పెట్టాడు చిరు. ఇలా ‘బ్రూస్లీ ‘వచ్చింది. ఈ సినిమా కూడా దారుణంగా విఫలమైయింది. అయినా మెగా ఫ్యామిలీకి వైట్లపై నమ్మకం సన్నగిల్లలేదు. మరో మెగా హీరో వరుణ్ తేజ్, వైట్లతో సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు.
‘’మిస్టర్’’ తో నిన్ననే థియేటర్ లోకి వచ్చారు. దారుణమైన టాక్ వస్తోంది ఈ సినిమాకి. శ్రీనువైట్లలో సరుకైపొయిందని, ఆయన ఎక్కడో చూపించుకోవాలని పబ్లిక్ టాక్ లో అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆడియన్స్. నిజంగా అంతలా విసిగించేసింది మిస్టర్. అసలు ఏం చెబుతున్నారో అర్ధం లేకుండా ఏదేదో చూపించి ప్రేక్షకుడికి విసుగెత్తించేలా చేశారు. మిస్టర్ చూసిన ఆడియన్స్ ఫీలింగ్ ఇదే.
వరుసగా రెండు ఫ్లాపులు ఇచ్చిన తర్వాత కూడా మరో అవకాశం ఇచ్చింది మెగా ఫ్యామిలీ. అయితే వైట్ల మాత్రం దాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాడు. మొత్తంమ్మీద మెగా హీరోలకు హ్యాట్రిక్ ఫ్లాపులు ఇచ్చిన నెగిటివ్ రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు వైట్ల.