వివాదాలు, విజయాలు, కేసులు, జైలు గోడలు.. సంజయ్ దత్ జీవితంలో సర్వసాధారణమైపోయాయి. అతని జీవితం.. ఎప్పుడూ సంచలనాలమయమే. అక్రమాయుధాల కేసులో సంజయ్ జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చాడు. ప్రస్తుతం ఫ్యామిలీ, సినిమాలతో గడుపుతున్న సంజయ్ మరో వివాదంలో పడ్డాడు.
ఓ నిర్మాతని బెదిరించిన కేసులో సంజయ్‌దత్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. 2002లో నిర్మాత షకీల్ నూరాని, సంజయ్‌దత్‌తో ఓ సినిమా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందుకోసం 50 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. అయితే, అడ్వాన్స్ తీసుకున్న సంజయ్‌దత్ అనుకున్న ప్రకారం సినిమా చేయలేదు. అక్రమాయుధాల కేసులో జైలుకు వెళ్ళిపోయాడు. దీంతో నిర్మాత షకీల్ నూరాని తన డబ్బును తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోరాడు. దీనికి సంజయ్ నో చెప్బుతున్నాడు. పైగా వార్నింగ్స్ కూడా ఇస్తున్నాడని సదరు నిర్మాత కోర్టును ఆశ్రయించాడు.
ఈనేపధ్యంలో షకీల్ నూరాని, పిటీషన్ ను పరిశీలించిన కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సత్ప్రవర్తన క్రింద శిక్షాకాలం తగ్గించుకొని బయటికివచ్చిన సంజయ్ దత్ .. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం చర్చనీయంశమైయింది.