ముద్రగడ పద్మనాభం..ఒక తెలివైన రాజకీయవేత్త. అదే సమయంలో పంతం పట్టడంలో మారుపేరు. కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో ఆయన 1988లో ప్రారంభించిన ఉద్యమం క్రమేపీ బలపడుతూ వచ్చింది. కిందటి ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీని పట్టుకుని మరోసారి ఉద్ధృతంగా ఉద్యమించాలనుకున్న పద్మనాభం ఆశను రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దహనంతో ప్రభుత్వం చిదిమేయడం ప్రారంభించింది. ఒకరకంగా చెప్పాలంటే ఆయన బయటకు అడుగుపెడితే అరెస్టు చేసేంటంతగా ప్రభుత్వం తీవ్రమైన చర్యలకు దిగింది. కనీసం ర్యాలీ నిర్వహించడానికి కూడా అనుమతించడంలేదు. నిషేధాజ్ఞలు, శాంతిభద్రతలంటూ ఉక్కుపాదం మోపింది. అయినా ఆయన ఎప్పటికప్పుడు కొత్త పంథాలను ఎంచుకుంటూనే ఉన్నారు. 1989లో ఏ దీక్షతోనైతే అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డినే కిర్లంపూడి రప్పించారో.. అదే అస్త్రం టీడీపీకి వ్యతిరేకంగా పనిచేయలేదు. తల మొత్తుకున్నా పట్టించుకోలేదు. ఆఖరుకు చేసేది లేక..ఉద్యమం సజీవంగా ఉండాలంటే తాను ఆరోగ్యంగా ఉండాలనుకుని రాజీ పడ్డారు. ఇప్పుడు తన పట్టును వీడలేదని చెప్పడానికి ఒక లేఖ రాశారు. అది రాసింది ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు కాదు.. ఆయన ప్రత్యర్థి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు. శత్రువుకు శత్రువు మిత్రుడనే సూత్రాన్ని పాటించారు ముద్రగడ.
తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ప్రశంసిస్తూ ఆయన లేఖలో కేసీఆర్‌ను ఆకాశానికెత్తేశారు. హామీలివ్వడం కాదు నెరవేర్చుకోవడం ముఖ్యం. ఆ దిశగా కేసీఆర్ విజయం సాధించారని చెప్పుకొచ్చారు ముద్రగడ. పరోక్షంగా ఇది చంద్రబాబును నిందించడమే. నువ్వూ ఇచ్చావు హామీలు ఎక్కడ నెరవేర్చావని నిలదీయడమే. రైతులకు రుణాలను మాఫీ చేయడాన్నీ ముద్రగడ ప్రస్తుతించారు. ఎన్నికల మేనిఫెస్టోలు చిత్తుకాగితాలు కాకూడదన్న సుప్రీం న్యాయమూర్తి వ్యాఖ్యలను దేశంలో మీరొక్కరే నెరవేర్చారని ఆయన పేర్కొనడం. చంద్రబాబూ నువ్వా పనిచేయలేకపోయావని చెప్పడమే.
ఆ లేఖను ఇక్కడ పొందుపరుస్తున్నాం. ముద్రగడ వాడిన ప్రతి పదమూ కేసీఆర్‌కు పొగడ్తగానూ, చంద్రబాబుకు తెగడ్తగానూ ఉండేలా చాలా జాగ్రత్త తీసుకున్నారు.
Subrahmanyam Vs Kuchimanchi