సరైనోడు తరవాత బోయపాటి శ్రీను రేంజు మరింత పెరిగిపోయింది. స్టార్ హీరోలు.. కథలు సైతం వినకుండా సినిమాలు చేయడానికి రెడీ అయిపోయారు. అలాంటి స్థితిలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో సినిమా ఒప్పుకొని షాక్ ఇచ్చాడు శ్రీను. అయితే… ఇదంతా కమిట్మెంట్ వ్యవహారం. ఎప్పుడో బెల్లంకొండ సురేష్‌కి బోయపాటి మాట ఇవ్వడం వల్ల… ఆ మాటపై నిలబడాల్సిన అవసరం రావడం వల్ల, శ్రీను కమిట్మెంట్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బెల్లం కొండతో సినిమా తప్పించుకొనే ఛాన్స్లేకుండా పోయింది. అయితే… శ్రీనుకి మాత్రం అన్యాయం ఎక్కడా జరగలేదు. శ్రీను కోరుకొన్న హీరోయిన్లు, టెక్నీషియన్లు టీమ్‌లోకి రాగలిగారు. కోరుకొన్నదానికంటే ఎక్కువ రెమ్యునరేషన్ పొందగలిగాడు.
లెజెండ్ తరవాత బోయపాటికి రూ.10 కోట్ల పారితోషికం ఇవ్వడానికి సిద్దపడ్డారు నిర్మాతలు. బెల్లం కొండ శ్రీనివాస్ సినిమాకి రూ.13 కోట్ల పారితోషికం డిమాండ్ చేశాడట. అయితే.. రూ.15 కోట్ల వరకూ అందుకొన్నట్టు టాక్. దర్శకుడు అడిగిన దానికంటే ఎక్కువ పారితోషికం ఇచ్చారంటే.. శ్రీను రేంజు ఏ స్థాయికి చేరుకొందో అర్థం చేసుకోవొచ్చు. బెల్లం కొండ సాయి శ్రీనివాస్ సినిమా హిట్టయితే.. ఇక మీదట శ్రీను పారితోషికం రూ.13 నుంచి రూ.15 కోట్ల పారితోషికంగా ఫిక్సయిపోవొచ్చు. అటూ ఇటూ అయినా రూ.10 కోట్లు మాత్రం తగ్గడు. బెల్లం కొండ శ్రీనివాస్ తరవాత బోయపాటి కోసం సినిమాలు చేయడానికి ముగ్గురు పెద్ద హీరోలు రెడీగా ఉన్నారు. శ్రీను సినిమా ఎలాగున్నా సరే, ఆ ఎఫెక్ట్ బోయపాటి తదుపరి సినిమాపై పడే అవకాశం లేదన్నమాట. అలా… పారితోషికానికి పారితోషికం, నమ్మకానికి నమ్మకం.. రెండూ కలిసొచ్చేశాయి. బోయపాటి శ్రీను సుడి అలా ఉంది మరి.