మంచు విష్ణు, సోనారిక జంటగా జి.కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఫిలింస్ నూతన చిత్రం, వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ మంచు విష్ణు హీరోగా, ‘జాదూగాడు’ ఫేమ్ సోనారిక హీరోయిన్ గా ఓ నూతన చిత్రం రూపొందనుంది. శ్రీ వెంకటేశ్వరస్వామి ఫిలింస్ బ్యానర్ పై జి.కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో డి.కుమార్, పల్లి కేశవ్ రావ్ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా సినిమా ప్రారంభం కానుంది. మరో ప్రముఖ హీరోయిన్ కూడాఈ సినిమా నటించనుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 10, ఉదయం 9గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ లో పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యం వహిస్తున్నాడు.
బ్రహ్మానందం, రాజారవీంద్ర, పృథ్వీ, జయప్రకాష్ రెడ్డి, వెన్నెలకిషోర్, రఘుబాబు తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, ఆర్ట్: రామాంజనేయులు, ఫైట్స్: విజయ్, కో డైరెక్టర్: రాధా గోపాలరాజు(గోపి), నిర్మాణ, నిర్వహణ: సోమ విజయ ప్రకాష్, నిర్మాతలు: డి.కుమార్, పల్లి కేశవ్ రావ్, రచన-దర్శకత్వం: జి.కార్తీక్ రెడ్డి.