రాజమౌళి సినిమా అంటే.. సంగీత బాధ్యతలు ఎం.ఎం.కీరవాణి చూసుకొంటారన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే… కీరవాణితో పాటు మరో సంగీత దర్శకుడి చేయి కూడా..పడుతుంటుంది. ఆయనే.. కల్యాణి మాలిక్. రాజమౌళి దర్శకత్వం వహించిన చాలా సినిమాలకు కల్యాణి మాలిక్ తెర వెనుక పనిచేశాడు. కొన్ని కీలకమైన ఎపిసోడ్లకు ఆర్.ఆర్ అందించాడు. మరీ ముఖ్యంగా ఛత్రపతిలో.. ఓ రిపీటెడ్ బీజియం వస్తుంటుంది. దానికి ఆర్.ఆర్ ఇచ్చింది కల్యాణీ మాలికే. ఇప్పుడు `బాహుబలి 2` విషయంలోనూ కల్యాణీ మాలిక్ హస్తం ఉందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలకు, పతాక ఘట్టాలకూ కల్యాణీ మాలికే ఆర్.ఆర్ ఇచ్చాడట. ఆయా సన్నివేశాలన్నీ అద్భుతంగా ఎలివేట్ అయ్యాయని టాక్. కానీ ఏం లాభం..? ఆ పనితనమంతా కీరవాణికి చేరిపోతుంది. కనీసం కల్యాణి మాలిక్‌కి టైటిల్ కార్డులో అయినా క్రెడిట్ ఇస్తారో, లేదో??