రాజ్‌తరుణ్ తన కెరీర్‌లో తొలిసారి ఓ ప్రయోగం చేస్తున్నాడు. తన కొత్త సినిమాలో అంధుడిగా కనిపించబోతున్నాడు. టైటిల్ కూడా వెరైటీగా అంధగాడు అని పెట్టారు. హెబ్బా పటేల్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. టీజర్ ఈరోజు బయటకు వదిలారు. టీజర్లో పెద్దగా మెరుపులేం లేవు. టైటిల్ కి జస్టిఫికేషన్ ఇచ్చే కొన్ని షాట్లూ, డైలాగులు తప్ప. ఎక్కువగా ఎంటర్‌టైన్‌మెంట్‌ని నమ్ముకొన్నట్టు కనిపిస్తోంది గానీ, ఆ వినోదం ఏ స్థాయిలో ఉండబోతోందో మచ్చుక్కి కూడా చెప్పలేదు. ఆఖర్లో కళ్లు లేని వాళ్లని రోడ్డు దాటించాలనుకొనేవాళ్లపై ఓ సెటైర్ వేశాడు రాజ్ తరుణ్. ఆ డైలాగ్ సగం నమిలి, సగం మింగేసినట్టు అస్పష్టంగా వినిపిస్తోంది. క్యారెక్టర్ పరంగా స్పీడు ఓకే… డైలాగుల్లోనూ అదే స్పీడు చూపించాలనుకొంటే సగం సగమే అర్థమవుతాయి. కిట్టు ఉన్నాడు జాగ్రత్తతో ఓ హిట్టు కొట్టిన రాజ్ తరుణ్… అదే స్పీడు కంటిన్యూ చేయాలంటే అంధగాడునీ గట్టెక్కించాల్సిందే. కామెడీ ని నమ్ముకొంటే కచ్చితంగా రాజ్‌తరుణ్ ఖాతాలో మరో హిట్ చేయడం ఖాయం. కానీ.. అదే ఈ టీజర్‌లో మిస్సయ్యింది. తెరపై ఏం చేస్తారో మరి.