అనంతపురం జిల్లా గుంతకల్లులో విషాదం చోటుచేసుకుంది. వైటీ చెరువులో విహారానికి వెళ్ళినప్పుడు తెప్ప తిరగబడి 13మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో తొమ్మిదిమంది చిన్నారులున్నారు. ముగ్గురు తప్పించుకోగా ఇద్దరు గల్లంతయ్యారు. వారికోసం రెస్క్యూ టీమ్ విస్తృతంగా గాలిస్తోంది. మంత్రి పరిటాల సునీత సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సంఘటనపై తీవ్ర విచారాన్ని వ్యక్తంచేశారు. సీపీఐ నేత రామకృష్ణ ఈ సంఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు నష్టపరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. విహార యాత్రా స్థలాల్లో సరైన చర్యలు చేపట్టకపోవడమే దీనికి కారణమని ఆయన ఆరోపిస్తున్నారు. విహార యాత్రా స్థలాల్లో పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.