కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేదానికంటే బలమైన ప్రశ్న ఇది.
ఇప్పటి వరకూ బాహుబలి 2 తరవాతే నా పెళ్లి అని చెప్పుకొచ్చాడు ప్రభాస్. ఇప్పుడా అవకాశం లేదు. ప్రభాస్ వంకలు పెట్టే ఛాన్సే లేదు. మరోవైపు ప్రభాస్‌ని పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి పెంచుతున్నవాళ్లు ఎక్కువయ్యారు. ఆ జాబితాలో మోహన్ బాబు కూడా చేరారు. బాహుబలి 2 ని చూసిన మోహన్ బాబు.. ఆ చిత్రబృందాన్ని ప్రశంసలతో ముంచెత్తాడు. ముఖ్యంగా ప్రభాస్‌ని `బావా` అంటూ సంభోదిస్తూ.. ప్రభాస్ ఫ్యాన్స్ షాకయ్యేలా చేశాడు. ‘ బావా బాహుబలి.. నా సంతోషానికి అవధుల్లేవు. మీ నాన్నగారు ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు నీకున్నాయని నమ్ముతున్నాను. మీ అమ్మగారు బిడ్డ విజయాన్ని చూసి గర్విస్తారని భావిస్తున్నాను. ఈ సంవత్సరమైనా ఒక ఇంటివాడవై అమ్మ కోరికను, ఈ బావ కోరికను తీర్చగలవని ఆశిస్తున్నాను.. విజయీభవ’ అంటూ ట్వీట్ చేశారు మోహన్‌బాబు. అసలు ఇద్దరి మధ్యా ఉన్న బావా, బామ్మర్దుల సంబంధం ఏమిటో మరి. కృష్ణంరాజుకీ, మోహన్‌బాబుకీ మధ్య మంచి అనుబంధం ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొనే.. ప్రభాస్‌ని అలా పిలిచి ఉంటారు. ‘ప్రియమైన రానా.. బాహుబలిలో నీ నటన అద్భుతం.. విజయోస్తు.. దిగ్విజయోస్తు..’ అంటూ పనిలో పనిగా రానానీ పొగిడేశారు.
గర్విస్తుందని భావిస్తున్నాను. ఈ సంవత్సరమైనా ఒక ఇంటివాడివై అమ్మ కోరికను, ఈ బావ కోరికను తీర్చగలవని ఆశిస్తున్నాను. విజయీభవ #Prabhas
— Mohan Babu M (@themohanbabu) May 3, 2017
బావా బాహుబలి..పూర్వం దేశాన్ని రాజులు పరిపాలించారు. ఇప్పుడు ప్రపంచాన్నే 'రాజులు' పరిపాలిస్తున్నారని మా బావ ప్రభాస్ రాజు నిరూపించాడు.#Prabhas
— Mohan Babu M (@themohanbabu) May 3, 2017