దిల్‌రాజు సినిమా అంటే ఆయన హ్యాండ్ ఉండాల్సిందే. దర్శకుడు ఎవరైనా సరే.. దిల్‌రాజు సూచనల్ని శిరసా వహించాల్సిందే. ఎందుకంటే రాజుగారి జడ్జిమెంట్ అలాంటిది. అల్లు అర్జున్ – హరీష్ శంకర్ కాంబోలో రూపుదిద్దుకొంటున్న డీజే (దువ్వాడ జగన్నాథమ్) ఆయన సంస్థ నుంచి వస్తున్న సినిమానే. ఈ సినిమా విషయంలో రాజుగారి సూచనలు చాలా వరకూ అమలయ్యాయట. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ విషయంలో దిల్‌రాజు మార్పులూ చేర్పులూ సూచించారని వినికిడి. హరీష్ శంకర్ రాసుకొన్న క్లైమాక్స్ మరీ హెవీగా అనిపించించిందట. దాన్ని లైటర్ వేలో మార్చుకురమ్మన్నాడట దిల్‌రాజు.
దిల్‌రాజు సూచనలు అమలు చేస్తూ హరీష్ ఈ క్లైమాక్స్‌ని బాగా మౌల్డ్ చేశాడని టాక్. ముందు అనుకొన్న క్లైమాక్స్ కంటే.. తీసిందే బాగుందట. అవుట్ పుట్ విషయంలో అల్లు అర్జున్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడని తెలుస్తోంది. డీజే జూన్ 23న విడుదల కాబోతోంది. అనుకొన్న సమయానికే ఈ సినిమా పనులన్నీ పూర్తవుతున్నాయి. ప్రచారానికి కావాల్సినంత సమయం దొరికింది. అందుకే… డీజే పబ్లిసిటీని ఓ రేంజ్‌లో చేయాలని బన్నీ, దిల్‌రాజు భావిస్తున్నారని తెలుస్తోంది. నెల రోజుల ముందు గానే.. డీజే ప్రమోషన్లకు రిబ్బన్ కటింగ్ పడిపోవొచ్చు.