చేసేవన్నీ చేస్తూనే నేను నిప్పు అని తన గురించి తాను డప్పు వేసుకోవడంలో చంద్రబాబును మించినవాళ్ళు ఎవరూ ఉండరు. తెలుగు దేశం నాయకులు కూడా మాటలు జారుతున్నారు అని కొత్తగా ఏధో తప్పు చేస్తున్నారన్నట్టుగా తన స్టైల్లో మాట్లాడేశారు చంద్రబాబు. ‘రేయ్…..పాతేస్తా…నా కొ….’ అని అసెంబ్లీలో ఓ టిడిపి ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు ఇదే చంద్రబాబుకు ఏమీ అనిపించలేదా? ఇక వైఎస్ జగన్‌ని జేసీ సోదరులు, ఆనం బ్రదర్స్ ఏ రేంజ్లో తిడుతున్నారో చంద్రబాబుకు తెలియదా? చంద్రబాబు కూడా హాజరైన సభలో…….అదే వేదికపై నుంచి జేసీ దివాకర్‌రెడ్డి జగన్‌ని తిడుతూ ఉంటే చంద్రబాబు మురిసిపోయిన మాట వాస్తవం కాదా? కానీ చంద్రబాబు మాత్రం కొత్తగా ఏదో ఇప్పుడే తప్పులు మాట్లాడినట్టుగా చాలా నైస్‌గా స్పందిస్తాడు. ఆ తప్పులను నన్ను క్షమించను అనేలా మాట్లాడుతూ….వాళ్ళందరూ తేడా…నేను మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పుకోవడానికి ట్రై చేస్తాడు.
చంద్రబాబు ఆ మాటలు మాట్లాడిన తర్వాత……ఇప్పుడు రేవంత్‌రెడ్డి ‘ఆంధ్రా కుక్కలు’ అంటూ నోరుజారాడు. ఆంధ్రా కుక్కలకు ఉన్న పాటి విలువ తెలంగాణా ప్రజలకు లేదా? అని నోరు జారాడు. అమల అక్కినేని దగ్గర ఉన్న కుక్కలన్నీ ఆంధ్రావి అన్న విషయం ఈయనకు ఎలా తెలుసు? అలా అని చెప్పి ఇప్పుడు సమర్థించుకోవచ్చేమో కానీ రేవంత్‌రెడ్డి మాత్రం తప్పుగా మాట్లాడాడు అన్నది వాస్తవం. రాజకీయంగా ఎదగడానికి కెసీఆర్ స్టైల్ రెచ్చగొట్టుడు మార్గాన్నే ఎంచుకుంటూ ఉంటాడు రేవంత్‌రెడ్డి. ఇప్పుడు ఈ మాటలు కూడా ఆ భావనతో అన్నవే అయ్యే అవకాశం ఎక్కువ. ఈ మాటలకు తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తాడో చూడాలి. లేకపోతే ఈ విషయంలో కూడా అన్ని విషయాల్లోలాగే కెసీఆర్ మాట్లాడితేనే తప్పు…….తెలుగు దేశం పార్టీ నాయకుడు మాట్లాడితే తప్పులేదు అన్నట్టుగా వ్యవహరిస్తాడేమో చూడాలి.