జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు లేదా అప్పుడప్పుడూ ట్విట్టర్ ద్వారా ప్రకటనల ద్వారా సమస్యలపై స్పందన తెలియజేయడం మంచి విషయమే. ప్రజల్లోకి రాకుండా ట్వీట్టతో సరిపోతుందా అనే ప్రశ్నవస్తున్నా అసలంటూ ఏదో ఒక స్పందన వుండటం మెరుగు. ఈ క్రమంలో ఆయన ఇటీవల ఉత్తర దక్షిణ భారతాల మధ్య వివక్ష గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. తాజాగా మిర్చి ధరపై చేసిన ప్రకటనలోనూ తెలంగాణలో ఎపిలో ఒకే పరిణామంలో కొనకుండా కేంద్రం విభేదాలు సృష్టిస్తుందని ఆరోపించారు. కేంద్రం వైఖరి బాగాలేని మాట నిజమే, ప్రకటించిన ధర సరిపోని మాటా నిజమే. ఈ విషయంలో ఎపి, తెలంగాణ ప్రభుత్వాల బాధ్యత కూడా చాలా వుంది.మార్కెటింగ్ వ్యవస్థ సక్రమ నిర్వహణ, కోల్డ్ స్టోరేజీలు దళారుల పాలు కాకుండా చూడటం జరిగితే పరిస్థితి కొంత మెరుగ్గా వుండేది. పైగా దేశంలో ఇతర రాష్ట్రాలలోవస్తున్న రేటు కూడా ఇక్కడ రావడం లేదు గనక వాటి స్థాయిలోనూ విమర్శలు అనివార్యం. అయితే ఎపి దగ్గర 88 వేల టన్నులు, తెలంగాణ దగ్గర 33 వేల టన్నులు కొంటామన్న కేంద్రం ప్రకటన వివక్షాపూరితంగా వుందని మంత్రి హరీశ్ రావుతో సహా ఏ పార్టీ కూడా విమర్శించలేదు. ఏమంటే పంట వచ్చిన పరిణామం, ఏదో మేరకు జరిగిన పరిణామాల రీత్యా తమ దగ్గర దాదాపు అయిపోవచ్చిందని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నది.కనుక సమస్య అది కాదు.అయితే పవన్ ఈ మధ్య తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ఆ మాట సూటిగా అనకుండా దక్షిణాది రాష్ట్రాల వాదనచేస్తున్నారు. ఆసక్తికరంగా గద్దర్ కూడా అదే అంటున్నారు. దక్షిణాది అంటేఇక్కడ ప్రధానంగా తెలంగాణనే దృష్టిలో వుంచుకుని మాట్లాడుతున్నారని, ఆయనకు ఇక్కడ కూడా ఎంతో కొంత ఓటింగు వుంటుందని ఆశిస్తున్నారని పరిశీలకుల మాట. గద్దర్ కూడా తోడైతే కొంత ఫ్రభావం చూపించాలని జనసేన ఆశ. అయితే సమస్యలు మరింత బాగా అధ్యయనం చేయడం అవసరం మరి.