పెద్ద సినిమాలు ఎలాగూ సోలో రిలీజ్నే కోరుకొంటున్నాయి. చిన్న సినిమాలకు అలాంటి ఆప్షన్ ఉండదు. నాలుగైదు సినిమాలతో కలసి పోటీ పడడమే. కాకపోతే.. గుంపులో గోవిందలా రావడానికి మీడియం రేంజు సినిమాలు కూడా ఆలోచిస్తున్నాయి. ఇది వరకు ఓ మోస్తరు హీరో సినిమా అంటే… సోలో రిలీజ్ కష్టంగానే ఉండేది. బాక్సాఫీసు దగ్గర కనీసం రెండు సినిమాలతో పోటీ పడే పరిస్థితి. కానీ నిర్మాతంలా ఒక్క త్రాటిపై ఉండడం వల్ల… సోలో రిలీజ్లు చూసే అవకాశం దక్కుతోంది. ఈవారం బాబు బాగా బిజీ వచ్చింది. వచ్చే వారం రాధ విడుదల అవ్వబోతోంది. నిజానికి మే 19న వేడుక చూద్దాం రారండోయ్ కూడా రావాల్సివుంది. కానీ… చైతూ కూడా సోలో రిలీజ్ నే కోరుకొంటున్నాడు. 19న రాధ ఉంది కాబట్టి… చైతూ వెనుకడుగు వేయాల్సివచ్చింది. నాగార్జున కూడా `సినిమా విడుదల చేయడంలో తొందరేం లేదు… అన్ని విధాలా సంతృప్తి చెందిన తరవాతే వస్తాం` అని స్టేట్మెంట్ ఇచ్చేశారు. సో.. వేడుక చూద్దాం రారండోయ్ ఈనెల 19న రావడం లేదు. బహుశా.. ఆ తరువాతి వారంలో చైతూ సినిమాని విడుదల చేసే అవకాశం ఉంది.