బోల్డంత ప్రతిభ ఉన్నా…. తెరపై రాణించని వాళ్ల జాబితాలో స్వాతి కూదా ఉంటుంది. అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, స్వామి రారా, కార్తికేయ…. ఇలాంటి విజయాలు స్వాతి ఖాతాలో ఉన్నా, ఎందుకో మనవాళ్లు చిన్నచూపు చూస్తూ వచ్చారు. త్రిపుర తరవాత స్వాతి మరీ డల్ అయిపోయింది. తెలుగులో మరో సినిమా చేయలేదు. చేయలేదు అనేదానికంటే అవకాశం రాలేదు అనడమే బాగుంటుందేమో..?? ఇంతకాలానికి మరో సినిమా రాబోతోంది స్వాతి నుంచి. తమిళం లో విజయ్‌సేతుపతి, రితిక నటించిన “ఆండవన్ కట్టాలై” చిత్రాన్ని తెలుగులో ‘లండన్ బాబులు’ పేరుతో రీమేక్ చేశారు. ఇందులో స్వాతి కథానాయిక. రక్షిత్ అనే కుర్రాడ్ని కథానాయకుడిగా పరిచయం చేస్తున్నారు. చిన్ని కృష్ణ దర్శకుడు. షూటింగ్ పూర్తయిపోయింది. జూన్‌లో ఈ సినిమాని విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇందులో స్వాతి యాంకర్‌గా కనిపించబోతోంది. స్వాతి కెరీర్ మొదలైందే యాంకర్‌గా. ఆ తరవాత సినిమాలతో బిజీ అయ్యింది. మరోసారి తన పాత రోజులు గుర్తు చేసుకోబోతోందన్నమాట. ఈ సినిమాతో అయినా స్వాతిలోని టాలెంట్ తెలుగు చిత్రసీమ గుర్తిస్తుందేమో చూడాలి.