తన కామెడీ ప్రసంగాలు, ఆ ప్రసంగాలు దొర్లిన తప్పులను పట్టుకుని ఒక ఆట ఆడుకుంటున్న సోషల్ మీడియా పని పట్టాలని రెడీ అయిపోయిన లోకేష్‌కి ఇప్పుడిక తత్వం బోధపడినట్టుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి తాయిలాలు ఇచ్చి భజన బృందంలో చేర్చుకున్నట్టుగా సోషల్ మీడియాని మేనేజ్ చేయడం కష్టమని చెప్పి సీనియర్లు ఎంత మంది చెప్పినా లోకేష్ వినలేదు. సోషల్ మీడియా జనాలను భయపెట్టాలనుకున్నాడు. కానీ లోకేష్ ప్లాన్స్ అన్నీ బూమరాంగ్ అయి విమర్శల దాడి ఓ స్థాయికి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు ఏం చేసినా కూడా మొత్తం టిడిపి పార్టీకే భారీ నష్టం జరిగేలా ఉంది పరిస్థితి. అందుకే తన రూటు మార్చుకున్నట్టున్నాడు లోకేష్.
తన లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నంలో పడ్డాడు. 2009 ఎన్నికల్లో చంద్రబాబు అవసరం మేరకు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ప్రసంగాలు గుర్తున్నాయా? ఖాకీ డ్రెస్‌లో పెద్ద ఎన్టీఆర్‌ని గుర్తుకు చేస్తూ మీడియాతో పాటు జనాలందరి చూపు తనవైపు తిప్పుకునే స్థాయిలో రాజకీయ ప్రసంగాలు చేశాడు ఎన్టీఆర్. వైఎస్, చంద్రబాబు, చిరంజీవి, పవన్‌ల ప్రసంగాల కంటే కూడా ఎన్టీఆర్ ప్రసంగాలకే ఆ ఎన్నికల ప్రచారం సమయంలో ఎక్కువ స్పందన వచ్చింది అన్న మాట వాస్తవం. స్ట్రెచర్ పై నుంచి ఇచ్చిన ప్రసంగాలు అయితే అదిరిపోయాయి. ఆ ఎన్టీఆర్ ప్రతిభ పుణ్యమా అనే….ఎన్టీఆర్ ముందు లోకేష్ అస్సలు నిలబడలేడన్న స్పష్టమైన అవగాహనతోనే టిడిపికి ఎన్టీఆర్‌ని దూరం చేసేశాడు చంద్రబాబు. అయితే ఇప్పుడు ఒక విషయంలో మాత్రం ఆ ఎన్టీఆర్ మార్గాన్నే ఎంచుకున్నాడు లోకేష్. ఆ ఎన్నికల ప్రచారం సమయంలో ఎన్టీఆర్ మిత్రుడు అయిన రాజీవ్ కనకాలకు మిత్రుడు అయిన రామారావు అనే జర్సలిస్ట్ ప్రసంగాల విషయంలో ఎన్టీఆర్‌కి హెల్ప్ చేశాడు. ఇఫ్పుడు లోకేష్ ఆ రామారావుని అపాయింట్ చేసుకున్నాడు. లోకేష్ ప్రసంగాలు మెరుగ్గా ఉండేలా తీర్చిదిద్దే బాధ్యతను ఆ రామారావుకు అప్పగించాడు. అంతా బాగానే ఉంది కానీ ఇలాంటి రామారావులు ఎంతమంది వచ్చినా సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్‌ల వాయిస్‌లో ఉన్న స్పష్టత, గాంభీర్యం….అన్ని ఎమోషన్స్‌ని అద్భుతంగా పలికించగల సామర్థ్యం లోకేష్‌కి వస్తాయా? సోషల్ మీడియా జనాలను ఏదో చే్ద్దామనుకుని దెబ్బతిన్న లోకేష్…….ఈ ప్రయత్నంలో అయినా గెలుస్తాడేమో చూడాలి మరి. ట్విట్టర్లో కూడా తప్పులు చేయకుండా ఉండేలా అక్కడ కూడా ఇంకో గైడ్‌ని నియమించుకుంటే బాగుంటుందేమో కూడా లోకేష్‌కి ఎవరైనా సలహా ఇస్తే బాగుంటుందేమో. మొత్తానికి లోకేష్ టిడిపికి ఎంత బలమవుతున్నాడో తెలియదు కానీ తాను చేస్తున్న తప్పులను కవర్ చేసే పెద్ద కష్టాన్ని మాత్రం టిడిపి పార్టీపైన గట్టిగానే రుద్దుతున్నాడు.