నందమూరి బాలకృష్ణ – పూరి జగన్నాథ్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈనెల 11నుంచి పోర్చుగల్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. దాదాపు 40 రోజుల పాటు అక్కడ భారీ యాక్షన్ దృశ్యాలతో పాటు, పాటల్నీ తెరకెక్కిస్తారు. ఈలోగా.. ఇక్కడ ఈ చిత్రానికి సంబంధించిన బిజినెస్ మొదలైపోయింది. తొట్టతొలుత శాటిలైట్‌తో బోణీ కొట్టేశారు. జెమినీ సంస్థకు ఈ చిత్రాన్ని రూ.9 కోట్లకు అమ్మేసింది చిత్రబృందం. ఇది వరకు బాలయ్య చిత్రాలన్నీ రూ.6 నుంచి రూ.8 కోట్ల వరకూ పలికేవి. సింహా, లెజెండ్ చిత్రాలకు శాటిలైట్‌లో ఇప్పటికీ మంచి రేటింగులు వస్తున్నాయి. దాంతో గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాకి భారీ ఎత్తున కొనేసింది మాటీవీ. అయితే ఇప్పటి వరకూ రెండు సార్లు ఈ చిత్రాన్ని టీవీలో టెలికాస్ట్ చేసినా.. రేటింగులు అంతంత మాత్రంగా వచ్చాయి. అయినా సరే.. పూరి సినిమాకి రూ.9 కోట్లు పలకడం విశేషమే. ప్రస్తుతం చిత్రబృందం ఓ పవర్ ఫుల్ టైటిల్ కోసం అన్వేషిస్తోంది. పోర్చుగల్ షెడ్యూల్ పూర్తయిన తరవాత.. టైటిల్‌ని అధికారికంగా ప్రకటించడానికి సమాయాత్తం అవుతోంది యూనిట్.