తెలుగు ప్రజలందరినీ ఉలిక్కిపడేలా చేసిన, అలాగే తెలుగు నాట అత్యంత ఎక్కువ చర్చనీయాంశమైన విషయాల్లో బాలయ్య కాల్పుల ఎపిసోడ్‌కి కూడా కచ్చితంగా స్థానం ఉంటుంది. గన్ కల్చర్ అప్పటికి పెద్దగా అలవాటులేని పరిస్థితుల నేపథ్యం, బాలయ్యలాంటి ఓ స్టార్ హీరో ఇంట్లో జరిగిన ఘటన కావడంతో తెలుగు ప్రజలందరూ షాక్‌కి గురయ్యారు. కాల్పుల ఘటన తర్వాత చోటు చేసుకున్న హాస్పిటల్ డ్రామా అయితే డబ్బు, అధికారం, పలుకుబడి ఉన్నవాళ్ళకు మన చట్టాలు ఏ స్థాయిలో చుట్టాలు అవుతాయి అన్న విషయం నిరూపించింది. అలాగే ఈ సంఘటనపై పుట్టుకొచ్చిన ఊహాగానాలు కూడా అన్నీ ఇన్నీ కావు. బాలయ్యకు జగన్ వీరాభిమాని అని, జగనే పట్టుబట్టి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ని ప్రభావితం చేసి కేసులు లేకుండా చేశాడన్న వార్తలు కూడా బ్రహ్మాండంగా షికార్లు చేశాయి.
అలాంటి జగన్ ఈ మధ్యనే అసెంబ్లీ సాక్షిగా బాలయ్య కాల్పుల ఎపిసోడ్‌పై సెటైర్స్ వేశాడు. అంతా రాజకీయ మహిమ అనుకోవాలేమో మరి. ఇక తాజాగా ఆనాటి హాస్పటిల్ డ్రామాలో తన పాత్రను ఇప్పటి భజన మీడియా స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా అద్భుతంగా పోషించిన డాక్టర్ కాకర్ల సుబ్బారావు సీన్లోకి వచ్చారు. అప్పట్లో ఈయన చెప్పినవన్నీ కాకమ్మ కబుర్లే అని ఎన్నో జోకులు పేల్చారు. బాలయ్యతో వ్యవహారం ఎక్కడ చెడిందో కానీ ఇప్పుడు ఈయనగారు పూర్తిగా రివర్స్‌లో మాట్లాడుతున్నారు. బాలయ్యకు విశ్వాసం లేదు అని చెప్తున్నాడు. కాకర్ల వారు ఈ మాటలను ప్రస్తుతానికి అయితే టిడిపి భజన జర్నలిస్టుకి వినిపించాడు కాబట్టి మరీ ఎక్కువ సంచలనాలు బయటకు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయడం వృథా. కానీ ఇకపైన జగన్ మీడియా బృందంతో పాటు స్వతంత్ర మీడియా జనాలు కూడా కాకర్లను వదలకపోవచ్చు. ఈ లోపు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు, ఎమ్మెల్యే అయిన బాలయ్యలు ఈ విషయంలో మరీ ఎక్కువ ఓపెన్ అవకుండా కాకర్లను మేనేజ్ చేశారా ఒకె. అలా కాకుండా కాకర్ల వారు నాటి కాకమ్మ కబుర్ల కథాకమామిషు మొత్తం విప్పారంటే మాత్రం బాలయ్యకు తలనొప్పి మొదలైనట్టే. అసలు బాలయ్య టైం ఈ మధ్య అంత గొప్పగా నడుస్తున్నట్టుగా లేదు. హిందూపురం ప్రజలు ఈ ఎమ్మెల్యేగారిపైన కారాలు మిరియాలు ఓ స్థాయిలో నూరుతున్నారు. ఇక ఇప్పుడు కాకర్ల వారు సెన్సేషనల్ కామెంట్స్‌తో సీన్లోకి వచ్చారు. అర్జెంట్‌గా కాల్పుల విషయం మరిచిపోయి జ్యోతిష్య ప్రవీణ చౌదరిని పిలిపించుకుని జ్యోతిష్యం చెప్పించుకుంటే బెటరేమో.