పైకి ఏం మాట్లాడుతున్నా వైఎస్‌ఆర్‌సిపి జగన్ మోడీ భేటిపై మరీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబును వదలి తమనే దగ్గర చేసుకుంటారనే ఆలోచనలో వుంది. ప్రత్యేక హౌదా విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని పదేపదే విమర్శించకుండా ఎన్నికలు దగ్గర పడిన తర్వాత రాజీనామాలు చేస్తామని లాంచనంగా ప్రకటిస్తారట. ఆ వెంటనే కేంద్రం హౌదా ఇచ్చేస్తుందట. ఇది వైసీపీ విజయంగా ప్రజలు భావిస్తారు గనక బిజెపి వచ్చి తమతో జట్టు కడుతుందట. ఇది ఆ పార్టీకి చెందిన ఒక మాజీ మంత్రి ఇచ్చిన విశ్లేషణ. ఇంతకాలం ఇవ్వని మోడీ సర్కారు ఆఖరులో మాత్రం ఎందుకు హౌదా ఇస్తుంది? తెలంగాణపై ఎక్కువ కేంద్రీకరణ చేసిన బిజెపి ఎపికి అనుకూలమైన నిర్ణయం తీసుకుంటుందా? అంటే ఔను అనే వారు చెబుతున్నారు. అవినీతిపై పోరాటం అంటూ అన్ని కేసులు ఎదుర్కొంటున్న జగన్‌తో ఎలా కలుస్తారు అంటే బిజెపి అధికారం కోసం ఏదైనా చేస్తుందని కర్ణాటకలో తమ పాత మిత్రుడైన గాలి జనార్ధనరెడ్డికి అవకాశమిచ్చిన యెడ్యూరప్పకు సర్వాధికారాలు కట్టబెట్టారు కదా అని వారు వాదిస్తున్నారు. ఇదంతా వినడానికి బాగానే వుండొచ్చు గాని తెలుగుదేశంతో స్నేహం అంటూనే రెండో వారిని చేరదీసిన బిజెపి తమ విషయంలో మాత్రం అత్యంత నిజాయితీగా వ్యవహరిస్తుందని వైసీపీ వారెందుకు భ్రమపడుతున్నారో తెలియడం లేదు. జగన్‌ను జైలుపాలు చేసి వైసీపీని తమలో కలిపేసుకుంటుందని ఆ పార్టీ వ్యతిరేకుల జోస్యంగా వుంది.అమిత్ షా తల్చుకుంటే ఏదైనా సాధ్యమే కదా