దర్శకులుగా మారిన డాన్స్ మాస్టర్ల లిస్టు పెద్దదే ఉంది. ప్రభుదేవా, లారెన్స్, అమ్మ రాజశేఖర్… వీళ్లంతా మెగా ఫోన్ పట్టినవాళ్లే. రాజు సుందరంకీ ఆ కోరిక ఉంది. అప్పుడెప్పుడో ఓ సినిమా చేసినా సరిగా ఆడలేదు. చాలాకాలంగా తెలుగులో ఓ సినిమా చేయాలని తెగ తాపత్రయ పడుతున్నాడు. కథ సిద్దం చేసుకొని అగ్ర కథానాయకులకీ వినిపించాడు. వాళ్లంతా ‘చేద్దాం.. చూద్దాం’ అంటూ తప్పించుకొంటున్నారు. ఎట్టకేలకు ఈ డాన్స్ మాస్టర్‌కి ఓ హీరో దొరికాడు. తనే.. నిఖిల్. రాజు సుందరం చెప్పిన కథ నిఖిల్ కి నచ్చేసింది. వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. కేశవ తరవాత పట్టాలెక్కబోయే నిఖిల్ చిత్రం ఇదే. అనిల్ సుంకర ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో ఇద్దరు హీరోయిన్లుంటారు. నిఖిల్ ఇంజనీరింగ్ విద్యార్థిగా కనిపించబోతున్నాడు. జూన్ నుంచి ఈసినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. మరి డాన్స్ మాస్టర్ గా అలరించిన రాజు సుందరం… దర్శకుడిగా ఎన్ని మార్కులు తెచ్చుకొంటాడో చూడాలి.