తెలుగు సినిమా చరిత్రలో దర్శకుడు రాజమౌళి పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. ‘బాహుబలి’ లాంటి కలగని ఆ కలను నిజం చేసి తెలుగు సినిమా మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా పెంచాడు రాజమౌళి. ఎంతో సహనం,ఓపిక, పట్టుదల, కృషి ఉంటేనే గాని ఇలాంటి విజయం సాధ్యం కాదు. జనరల్ గా ఒక సినిమా విజయవంతమైతే మొదటి దాని స్టార్ కాస్ట్ కు క్రెడిట్ దక్కుతుంటుంది. ఇండియన్ సినిమాల్లో చాలా వరకూ ఇదే ట్రెండ్ కనబడుతుంది. హాలీవుడ్ సినిమాల్లా జేమ్స్ కామెరూన్,స్పిల్ బర్గ్, మార్టిన్ స్కర్సేస్ .. ఇలా దర్శకుడుకి క్రెడిట్ వెళ్ళడం అరుదుగా కనిపిస్తుంది. ఎప్పుడూ హీరోలే సూపర్ స్టార్లు ఇక్కడ.
అయితే బాహుబలితో ఈ ట్రెండ్ మార్చేశాడు రాజమౌళి. బాహుబలి అంటే రాజమౌళినే. ఈ విషయంలో ఎవరు వాదనలు ఎలా వున్నా.. బాహుబలి మొత్తం క్రెడిట్ రాజమౌళి ఖాతాలో పడిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రూ.1500 కోట్లు రాబట్టిన దర్శకుడిగా రాజమౌళి పేరు ఇప్పుడు మార్మ్రోగిపోతుంది. రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా ఓ బ్రాండ్ అయిపోయింది. అయితే ఈ చిత్ర విజయంలో రాజమౌళి ప్రదర్శిస్తున్న నమ్రత, వినయం, అణకువ.. హర్షినీయంగా వుంది. ”ఈ చిత్రానికి కేవలం దర్శకుడ్ని మాత్రమే. ప్రభాస్ , రానా , అనుష్క , రమ్యకృష్ణ , సత్యరాజ్.. ఒకరేమిటి.. చివరికి లైట్ బాయ్ కి కూడా బాహుబలి విజయంలో బాగం వుంది” అని తన విధేయతను చాటుకుంటున్నారు రాజమౌళి.
రాజమౌళిలోని ఈ అణకువే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు విస్మయానికి గురి చేస్తుందట. తాజాగా తన ట్విట్టర్ వేదిగా రాజమౌళి ని ఉద్దేశించి ఓ కామెంట్ చేశాడు వర్మ. ‘ బాహుబలి కలెక్షన్స్ కంటే రాజమౌళి అణకువ, నిగర్వం చాలా భయంకరమైనది’ అంటూ తనదైన శైలిలో స్పదించాడు వర్మ. జనరల్ గా వర్మ కామెంట్స్ లో డబల్ మీనింగ్ వుటుంది. ఐతే ఈ కామెంట్ మాత్రం ఆయన ఏ మీనింగ్ తో అన్నాడో కాని, బాహుబలి విజయంలో రాజమౌళి అణుకువకు హ్యాట్సఫ్ చెప్పాల్సిందే.