నాగచైతన్య, సమంత పెళ్లికి ముహూర్తం ఫిక్సయ్యిందా?. వేదిక కూడా ఖరారైందా?? అవుననే అంటున్నాయి అన్నపూర్ణ కాంపౌండ్ వర్గాలు. సమంతతో ఈ అక్టోబరులోనే పెళ్లి అని నాగచైతన్య క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో.. ఇప్పుడు పెళ్లి డేటు కూడా బయటకు వచ్చేసింది. అక్టోబరు 6న సమంత – చైతూల పెళ్లి జరగబోతోందని తెలుస్తోంది. పెళ్లి కూడా అందరూ అనుకొంటున్నట్టు హైదరాబాద్‌లోనో, చెన్నైలోనో కాదు. గోవాలో అట. పెళ్లి అటు హిందూ సంప్రదాయం ప్రకారం, ఇటు క్రీష్టియన్ సంప్రదాయ ప్రకారం రెండు విధాలుగానూ జరగబోతోంది. గోవాలో పెళ్లయ్యాక… హైదరాబాద్ లో భారీ రిసెప్షన్ ఇవ్వడానికి నాగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.