ఇంద్రగంటి మోహనకృష్ణ నుంచి వస్తున్న మరో చిత్రం `అమీ తుమీ`. అవసరాల శ్రీనివాస్, అడవిశేష్ కథానాయకులుగా నటించారు. జూన్ 2న ఈ సినిమాని విడుదల చేయాలనుకొంది చిత్రబృందం. అయితే… ఇప్పుడు ఈ సినిమా ఓ వారం ఆలస్యంగా అంటే జూన్ 9న వస్తున్నట్టు సమాచారం. వచ్చే వారంలో చిన్న సినిమాల హంగామా ఎక్కువగా కనిపించనుంది. వాటి మధ్య… ‘అమీ తుమీ’ నలిగిపోతుందని నిర్మాతలు భావించారేమో. అన్నట్టు ఈ సినిమాలో వెన్నెల కిషోర్‌ది ఓ టిపికల్ టైపు పాత్రట. విలన్ షేడ్స్ కూడా ఉంటాయనట. ఆ పాత్ర పేరే చిత్రవిచిత్రంగా ఉంటుందట. ”ఇంద్రగంటి మోహనకృష్ణ నా పాత్రని మలిచిన విధానం నాకే ఆశ్చర్యం కలిగించింది. ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పుడూ ఈ తరహా పాత్ర చేయలేదు. అక్కడక్కడ విలన్ షేడ్స్ కూడా కనిపిస్తాయి. నా పాత్రకి ఆయన పెట్టిన పేరు కూడా తమాషాగా ఉంటుంది” అంటున్నాడు వెన్నెల కిషోర్.
ప్రచార చిత్రాలు చూస్తే ఓ విషయం అర్థం అవుతోంది. ‘అష్టా చమ్మా’ ఫార్మెట్‌లోనే ఈ సినిమా సాగిపోతుందనిపిస్తోంది. ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు… తనికెళ్ల భరణి, మహేష్ పేరు వాడుకోవడం.. ఇదంతా ఈ రెండు సినిమాల్లోనూ కామన్ గా కనిపించే లక్షణాలు. మణిశర్మ అందించిన బాణీలూ బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ‘అమీ తుమీ’ అని కాకుండా ‘అష్టా చమ్మా 2’ అని పేరు పెడితే బిజినెస్ ఇంకా బ్రహ్మాండంగా ఉండేదేమో..?