హీరోల లిస్టు నుంచి రాజశేఖర్ పేరు దాదాపుగా డిలీట్ అయిపోతున్న తరుణంలో ఓ ఆఫర్ వచ్చింది. `గరుడ వేగ` రూపంలో. కమర్షియల్‌గా, క్రిటిక్స్ పరంగా మంచి పేరు తెచ్చుకొన్న ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకుడు అవ్వడంతో… సాధారణంగానే ఈ సినిమాపై హోప్స్ పెరిగాయి. పైగా సన్నీలియోన్‌ని రంగంలోకి దించి… `కిక్` పెంచే ప్రయత్నం చేశారు. ఈ సినిమాపై మంచి బజ్ మొదలైంది. దాంతో పాటు… రాజశేఖర్ కెరీర్‌కి సరికొత్త మార్గాలు తెరచుకొన్నట్టైంది. కొత్త అవకాశాలు కూడా పలకరిస్తున్నాయట. అందులో భాగంగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు.. రాజశేఖర్‌కి ఓ కథ వినిపించాడట. అది రాజశేఖర్‌కీ బాగా నచ్చిందని తెలుస్తోంది. థ్రిల్లర్ చిత్రాల్ని రూపొందించడంలో వెంకట్ ప్రభు సిద్దహస్తుడు. తక్కువ బడ్జెట్లో మంచి మేకింగ్ క్వాలిటీతో సినిమాల్ని అందిస్తాడు. అలాంటి దర్శకుడితో పనిచేయడం.. రాజశేఖర్‌కి కలిసొచ్చే విషయమే.
విలన్ తరహా పాత్రల్లో రాజశేఖర్ బాగా సూటైపోతాడు. ఆ పాత్రలకు ఓకే అంటే… జగపతిబాబుకి చెక్ పెట్టినట్టే. అయితే రాజశేఖర్ షూటింగ్ కి సరిగా రాడని, ఉదయం పూట.. రాజశేఖర్ సెట్లో అస్సలు కనిపించడని చిత్రసీమలో చాలా బ్యాడ్ టాక్ నడిచింది. తన పాత అలవాట్లని రాజశేఖర్ మెల్లి మెల్లిగా వదులుకొంటున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే… రాజశేఖర్‌కి హ్యాపీ డేస్ మొదలైపోయినట్టే.