బాలీవుడ్లో ఓ సినిమా రూపుదిద్దుకొంది. దాని పేరు ‘రాబ్టా’. సుశాంత్ రాజ్ పుట్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి దినేష్ దర్శకుడు. లవ్ ఆజ్ కల్, కాక్టైల్ లాంటిచిత్రాల్ని రూపొందించిన దర్శకుడీయన. కాబట్టి రాబ్టాపై అంచనాలు పెరిగాయి. అయితే.. ఈ సినిమా కథ తెలుగు ‘మగధీర’కు దగ్గరగా ఉందని తెలుస్తోంది. ట్రైలర్ చూస్తే.. ఆ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. ఇద్దరు ప్రేమికులు.. ఓ విలన్… మరో జన్మ… ఈ కాన్సెప్ట్ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ గా దింపేశాడు. నీటి ధారల్లోంచి రామ్చరణ్ గుర్రంతో దూసుకొచ్చే సీన్ (మగధీర ఇంట్రవెల్ బ్యాంగ్) సేట్ టూ సేమ్ కట్ కాపీ పేస్ట్ చేసినట్టు అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ‘మగధీర’ టీమ్… ‘రాబ్టా’పై పోరాటం చేసేందుకు సన్నద్దమైంది. కాపీ రైట్ యాక్ట్ చట్టం కింద.. ‘రాబ్టా`పై న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. జూన్ 9న ‘రాబ్టా’ విడుదలకు సిద్దమైంది. జూన్ 1లోగా ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించాలని న్యాయ స్థానం సైతం ఆదేశించింది. మరి.. `మగధీర`కు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.