టాలీవుడ్‌లో ఉన్న ది బెస్ట్ డాన్సర్లలో అల్లు అర్జున్ ఒకడు. ఆ మాటకొస్తే… ఆల్ ఇండియాలోనూ బన్నీ డాన్సు విషయంలో ది గ్రేటే! చిన్న చిన్న స్టెప్పుల్ని సైతం చాలా ఈజ్ తో వేస్తాడు. బన్నీ టాలెంట్ మరోసారి ప్రూవ్ అయ్యింది. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం దువ్వాడ జగన్నాథమ్. జూన్ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈలోగా ప్రమోషన్లు కూడా మొదలెట్టేసింది చిత్రబృందం. ఆమధ్య డీజే అంటూ సాగే తొలి పాటని విడుదల చేసిన టీమ్.. ఇప్పుడు రెండో పాటనీ వదిలేసింది. గుడిలో బడిలో మడిలో అంటూ సాగిన ఈ పాట.. వీడియో రూపంలో అప్‌లోడ్ చేసింది చిత్రబృందం. ట్యూన్ ఓకే అనిపించేలా ఉంది గానీ, అందులో బన్నీ స్టెప్పులు, స్టెప్పుల్లో అతని గ్రేస్, కాస్ట్యూమ్స్ ఇవన్నీ అదిరిపోయాయి. బన్నీ సింపుల్ స్టెప్పులు వేయడానికే… డీఎస్‌పీ ఇలాంటి ట్యూన్ సెట్ చేశాడా… అనిపిస్తోంది. పూజా హెగ్డే ఈ పాటలో మరింత గ్లామరెస్ గా కనిపిస్తోంది. డీజే నుంచి మరో ట్రీట్ వచ్చేంత వరకూ ఈ పాట దుమ్ము రేపడం ఖాయం. పాటల్లో పదాలు కూడా కాస్త గమ్మత్తుగానే ఉన్నాయి.. హీరో బ్రాహ్మణ కుర్రాడు కదా, అందుకే అగ్రహారం, మడి, తాంబూలం, తమలపాకు అనే పదాలకు చోటిచ్చారు. మొత్తానికి ఈ పాటతో డీజేపై నమ్మకం మరింత పెరిగింది.