సోమవారం పేరు మారిపోనుందా. అవుననే అనిపిస్తోంది. మహానాడు వేదికగా నిన్న చంద్రబాబు చేసిన ప్రసంగం ఈ అభిప్రాయాన్నే కలిగిస్తోంది. అమరావతి, పోలవరం ఇవే తన ఆకాంక్షలని పేర్కొన్నారు. అవి పూర్తయితే రాష్ట్రానికి ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. వారాల పేర్లలో మొదటిది సోమవారం. పోలవరం పూర్తికాగానే ఆ రోజుకు పోలవారంగా మారుస్తామన్నారు. పోలవరం పూర్తయితే వచ్చేప్రయోజనాలను వివరిస్తూ, రాష్ట్ర భవితను మలుపుతిప్పే ఆ ప్రాజెక్టు పేరిట వారం పేరు మారిపోతుందన్నారు. తను అనుకుంటున్నట్లు వారం పేరును మారిస్తే… చంద్రబాబు పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మహానాడు వేదికపై నుంచి ఆయన చేసిన ప్రసంగంలో అధికశాతం అభివృద్ధి పనులపైనే మాట్లాడారు. మధ్యమధ్యలో ప్రతిపక్షంపై చురకలేశారు. మూడు రోజుల మహానాడులో చర్చను అభివృద్ధిపైనే కేంద్రీకరించి కొత్త శాసనాన్ని లిఖించారు చంద్రబాబు.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి