డాన్ శీనుతో సినిమాతో తొలి అడుగులోనే హిట్ కొట్టాడు గోపీచంద్ మలినేని. రవితేజతోనే తీసిన బలుపు కూడా బాగానే ఆడింది. అయితే.. ఈ రెండు సినిమాలు మినహాయిస్తే గోపీచంద్‌కి పెద్దగా కలిసిరాలేదు. తీసిన ప్రతీ సినిమా ఫ్లాప్ అయ్యింది. తాజాగా.. ‘విన్నర్’ కూడా నిర్మాతలకు భారీ నష్టాలకు గురి చేసింది. ఇప్పుడు రామ్ కోసం పడిగాపులు కాస్తున్నాడు గోపీచంద్. వీరిద్దరి కాంబోలో పండగ చేస్కో సినిమా వచ్చింది. అది.. బీ,సీల్లో వసూళ్లు సాధించుకోగలిగింది. ఆ నమ్మకంతోనే రామ్ తనకు మరో అవకాశం ఇస్తాడని ఎదురుచూస్తున్నాడు గోపీచంద్ మలినేని. భోగవల్లి ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించే అవకాశాలున్నాయి. నేను శైలజ తరవాత.. మళీ్ల రామ్ కెరీర్ కాస్త పట్టాలెక్కినట్టే కనిపించింది. హైపర్ ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఈ దశలో గోపీచంద్ మలినేనికి మళ్లీ ఛాన్స్ ఇస్తాడా?? అనేది కాస్త డౌటే. కథ బాగుంటే ఎప్పుడైనా, ఎలాంటి కాంబినేషన్ అయినా సెట్టయ్యే ఛాన్సుంది. సో… గోపీచంద్ చేతిలో అలాంటి కథ ఉంటే.. ఈ కాంబో సెట్ అయిపోవొచ్చు. చూద్దాం.. గోపీ ప్రయత్నాలు ఎంత వరకూ నెరవేరతాయో..??