తెలుగుదేశం పార్టీలో ముఠాతగాదాలను అరాచక ఘటనలను పైకి కనబడనీయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు ముగించారు. ఉప్పు నిప్పులా వుండే అయ్యన్న పాత్రుదు గంటా శ్రీనివాసరావు వర్గాలు కూడా తాత్కాలికంగా మౌనం పాటించాయి. అయితే ఆ సభ ముగిసిందో లేదో అయ్యన్న నోరు తెరిచారు. ఉత్తరాంధ్రలో భూముల దందా జరుగుతున్నదని ఆరోపించారు. వెంటనే వైసీపీ నాయకులు ఈ విషయమై విచారణ జరపాలని కోరారు. సమస్య సర్దుబాటు చేసేందుకు నాయకత్వం ప్రయత్నించే లోగానే నవ నిర్మాణ దీక్షలో అయ్యన్న పాత్రుడు మరోసారి అదే విధమైన ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఆర్అండ్బి చీఫ్ ఇంజనీర్‌కు 140 కోట్ల ఆస్తులు సబ్ రిజిస్ట్రార్‌కు 40 కోట్ల ఆస్తులు ఎలా వస్తాయంటూ నిలదీశారు. ఇవన్నీ అధికారులపై చేసిన వ్యాఖ్యల్లా కనిపిస్తున్నా వాస్తవానికి ఆయన లక్ష్యం మాత్రం రాజకీయ నేతలు అందులోనూ తమ పార్టీ మంత్రులేనని అందరికీ తెలుసు. షరా మామూలుగా ఆయనకు చంద్రబాబు వర్తమానం వెళ్లడం లేదంటే పిలిపించి మాట్లాడ్డం తర్వాత సర్దుకోవడం…చూద్దాం. పైగా గంటా వర్గం ఏం చేస్తుందో కూడా చూడాలి