అప్సరస లాంటి సౌందర్యం అనుష్క సొంతం. అనుష్క అందానికి వంకపెట్టలేం అంటే అతిశాయోక్తి కాదు. జేజమ్మా అంటూ కత్తి తిప్పినా .. బిల్లాలో బికినీ వేసినా అనుష్కకే చెల్లింది. అయితే ఈ మధ్య అనుష్క ఫిజిక్ పై చాలా కామెంట్లు వచ్చేశాయి. ఇదంతా సైజ్ జీరో ఎఫెక్ట్. ఈ సినిమా కోసం పీపాలా తయారైయింది అనుష్క. అయితే ఆ ఫిజిక్ తగ్గించుకోవడం తలకు మించిన పనైపోయింది. దిని ఎఫెక్ట్ బాహుబలి పై కూడా పడింది. ఈ సినిమాలో అక్కడక్కడ హెవీగా కనిపించింది దేవసేన. అయితే అనుష్క ‘లావు’ పై తెరవెనుక జరిగిన కధ అంతా చెప్పాడు దర్శకుడు రాజమౌళి.
‘’బాహుబలి విషయంలో అనుష్క ఫిజిక్ ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అయితే అందులో పాపం స్వీటీ తప్పేమీలేదు. ముందు అనుకున్నా ప్రకారమే సైజ్ జీరో తర్వాత సన్నబడింది. అప్పుడు ఆమె చేసిన వర్క్ అవుట్స్ చూస్తే భయమేసేది. ప్రభాస్ , రానా లు చేసే వర్క్ అవుట్స్ చూసే వాడిని. ఇలా కూడా కష్టపడతారా ? అనిపించేంది. అయితే అంతకు మించి స్వీటీ వర్క్ అవుట్స్ చేసింది స్వీటీ. మాములుగా కాదు. ఈ వర్క్ అవుట్స్ వీడియోస్ చూస్తే భయమేసేది. బ్యాడ్ లక్ ఏమిటంటే.. ఓ సినిమా షూటింగ్ కోసం రుమినేయా వెళ్ళింది అనుష్క. అక్కడ మొకాళ్ళకి దెబ్బతగిలింది. మంచు ఎఫెక్ట్ వల్ల దెబ్బ తగిలినట్లు తెలియలేదు. కాని వారం రోజుల తర్వాత కాలు వాచిపోయింది. రెండు నెలలు బెడ్ రెస్ట్ చెప్పారు డాక్టర్లు. కనీసం నడవమ కూడా కుదరలేదు. దీంతో మొదట పడిన కష్టం అంతా వృధా అయ్యింది. పాపం.. ఇందులో స్వీటీ తప్పేమీ లేదు” అని చెప్పుకొచ్చాడు జక్కన్న. ప్రస్తుతం అనుష్క బాగ్ మతి షూటింగ్ ఓ బిజీగా వుంది. అశోక్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పొల్లాచిలో జరుగుతోంది.