గోపీచంద్ నటించిన ఆరడుగుల బుల్లెట్ ఈనెల 9న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా ఆర్థిక పరమైన సమస్యల్లో చిక్కుకొందిప్పుడు. విడుదలకు ముందు ఫైనాన్సియర్లు రివర్స్ అవ్వడంతో… బుల్లెట్ వస్తుందా, రాదా?? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సహదేవ్ అనే ఫైనాన్సియర్ ఆరడుగులు బుల్లెట్ నిర్మాత తాండ్ర రమేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వద్ద రూ.6 కోట్లు అప్పుగా తీసుకొన్నారని, సినిమా విడుదలకు ముందు సెటిల్ చేస్తానని చెప్పారని, అయితే.. అదేం చేయకుండా ఇప్పుడు సినిమా విడుదల చేసేస్తున్నారని, తన డబ్బులు సెటిల్ చేస్తేగానీ సినిమాని విడుదల చేయకూడదని సహదేవ్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో వ్యవహారం పీవీపీ సంస్థకు చుట్టుకొంది. ఎందుకంటే ఈ సంస్థే ఆరడుగులు బుల్లెట్ సినిమాకి టేకొవర్ చేసింది. ‘మా బాకీలు కూడా మరే చెల్లించండి’ అంటూ ప్రసాద్ పొట్లూరిపై ఒత్తిడి పెంచుతున్నారు అప్పుల వాళ్లు. సహదేవ్ని చూసి మరో ఇద్దరు ముగ్గురు ఫైనాన్సియర్లు తాండ్ర రమేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రంగం సిద్ధం చేసుకొన్నారని తెలుస్తోంది. వాళ్లంతా కలసి ‘ఆరడుగుల బుల్లెట్’ విడుదల ఆపేస్తారా?? లేదంటే.. ఈ వ్యవహారాన్ని పీవీపీ సెటిల్ చేసేస్తుందా?? చూడాలి. ఏం జరిగినా.. రేపు ఉదయం కల్లా.. క్లియరెన్స్ తెచ్చుకోవాలి. అందుకోసం తాండ్ర రమేష్ ఆపసోపాలు పడుతున్నట్టు తెలుస్తోంది.